కొత్తగా 10,171 మందికి కరోనా : ఏపీలో 2 లక్షలు దాటిన కేసులు

By Siva KodatiFirst Published Aug 7, 2020, 8:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,171 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 6,960 కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,171 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 6,960 కి చేరింది.

అలాగే 24 గంటల్లో 89 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,842కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉండగా.. లక్షా 20 వేల 464 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 23 లక్షల 62 వేల 270 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 62,938 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అలాగే గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 7,594 మంది కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 10, అనంతపురం 9, గుంటూరు 9, నెల్లూరు 9, పశ్చిమ గోదావరి 9, తూర్పుగోదావరి 7, ప్రకాశం 7, కృష్ణా 6, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 3, విజయనగరంలో ముగ్గురు మరణించారు.

గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 1,331 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం 1,100, చిత్తూరు 980, తూర్పు గోదావరి 1,270, గుంటూరు 817, కడప 596, కృష్ణా 420, నెల్లూరు 941, ప్రకాశం 337, శ్రీకాకుళం 449, విశాఖపట్నం 852, విజయనగరం 530, పశ్చిమ గోదావరి 548 మందికి పాజిటివ్‌గా తేలింది. 

click me!