ఏపీలో కరోనా ఉగ్రరూపం: ఒక్కరోజే 10,128 కేసులు, 77 మరణాలు

By Siva KodatiFirst Published Aug 5, 2020, 8:53 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా కొత్తగా 10,128 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 86 వేల 461కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా కొత్తగా 10,128 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 86 వేల 461కి చేరుకుంది.

కొత్తగా వైరస్ కారణంగా 77 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,681కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,426 యాక్టివ్ కేసులు వున్నాయని.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య లక్షా 4,354కి చేరుకుంది.

రాష్ట్రంలో 22 లక్షల 35 వేల 646 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 60,576 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 8,729 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

బుధవారం నాడు అత్యథికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,544 కేసులు వెలుగు చూశాయి.  ఆ తర్వాత కర్నూలు 1,368, అనంతపురం 1,260, చిత్తూరు 677, గుంటూరు 730, కడప 729, కృష్ణా 440, నెల్లూరు 537, ప్రకాశం 349, శ్రీకాకుళం 405, విశాఖపట్నం 842, విజయనగరం 665, పశ్చిమ గోదావరిలలో 582 కేసులు నమోదయ్యాయి.

అలాగే గుంటూరు జిల్లాలో కరోనా కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత విశాఖ 12, శ్రీకాకుళం 10, చిత్తూరు 8, తూర్పుగోదావరి 7, కృష్ణ 5, నెల్లూరు 4, కర్నూలు 3, విజయనగరం 3, పశ్చిమ గోదావరి 3, అనంతపురం 2, కడప 2, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించారు.

click me!