బాలిక కడుపులో తలవెంట్రుకల కణితి.. కేజీ జుట్టును తొలగించిన డాక్టర్లు..

By SumaBala BukkaFirst Published Feb 1, 2023, 12:40 PM IST
Highlights

ఓ 14యేళ్ల బాలిక పొట్టలోనుంచి కేజీ తలవెంట్రుకలను డాక్టర్లు తొలగించారు. ఆ వెంట్రుకలు ఆమె కడుపులో ఉండచుట్టుకుపోయి కణితిలా ఏర్పడ్డాయి. 

కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక కడుపులోనుంచి డాక్టర్లు కిలోకు పైగా తల వెంట్రుకలను వెలికితీశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామా నర్సింగ్ హోమ్ లో వెలుగు చూసింది. 14యేళ్ల సదరు బాలిక అన్నం సరిగా తినడం లేదు. దీనికి తోడు తరచుగా వాంతులు చేసుకుంటోంది. మనిషి రోజు రోజుకూ బక్కచిక్కిపోతోంది. దీంతో ఆమెకు ఏమయ్యిందోనని కంగారు పడ్డ తల్లిదండ్రులు డాక్టర్ల దగ్గరికి తీసుకువచ్చారు. 

15 రోజుల క్రితం శ్రీరామా నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారు. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు పొట్టలో ఏదో ఉందని గమనించారు. తల్లిదండ్రులను, బాలికను ప్రశ్నించగా ఆమెకు వెంట్రుకలు తినే అలవాటు ఉందని తేలింది. దీంతో వెంటనే ఎండోస్కోపీ చేయించారు. 

ఆ ఆడియోను ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు పంపారు.. జగనన్న నీ ఫోన్ ట్యాప్ చేస్తే..?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఎండోస్కోపీలో బాలిక కడుపులో వెంట్రుకలు ఉండ చుట్టుకుపోయి కణితి మాదిరిగా ఉండడం కనిపించింది. దీంతో మంగళవారం ఆమెకు ఆపరేషన్ చేశారు. ఈ వెంట్రుకలు కిలోకు పైగా బరువు ఉండడంతో వాటిని తొలగించారు. దీనివల్లే బాలిక రక్తహీనత బారిన పడిందని డాక్టర్లు తెలిపారు. 20యేళ్లలోపు బాలికల్లో జుత్తు తినే అలవాటు రక్తహీనత వల్ల వస్తుందని డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ తెలిపారు. అంతేకాదు ఈ అలవాటు 15వేలమందిలో ఒకరికి ఉంటుందని తెలిపారు. 

click me!