
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలంటూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి మద్ధతుగా లోక్‌సభ సభ్యత్వానికి మద్ధతుగా ఇటీవల రాజీనామా చేసిన ఎంపీలు జత కలిశారు. అయితే సభా నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన మాజీ సభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలపకూడదని మార్షల్స్ సూచించారు. దీంతో మాజీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని రాజ్యసభ సభ్యులకు మద్ధతుగా నిలిచారు.