తక్కువ పెట్టుబడితో ఊహించని లాభాలు తీసుకోచ్చే 5 పంటలు ఇవే!

By Navya ReddyFirst Published Mar 1, 2022, 6:30 PM IST
Highlights

ఎవరైనా సరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో ఎటువంటి వ్యాపారాలు చేయలేము. వ్యాపారాలే కాకుండా వ్యవసాయ పరంగా కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టడం కష్టమనే చెప్పవచ్చు.  కానీ తక్కువ పెట్టుబడితో వ్యవసాయంలో కూడా ఐదు రకాల పంటలు చేయవచ్చని దాని వల్ల ఊహించని లాభాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.
 
ఇంతకు ఆ పంటలు ఏంటంటే.. ప్రస్తుతం దేశంలో పుట్టగొడుగుల వాడుక బాగా ఆదరణ లో ఉంది. ఇక ఈ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ పంటపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా తక్కువ పెట్టుబడి కావటంతో చాలా మంది పుట్టగొడుగులను పెంచుతున్నారు. ముఖ్యంగా పాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

Latest Videos

పాల వల్ల కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. ఇక సేంద్రియ వ్యవసాయానికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. సేంద్రియ ఎరువులను తయారు చేసి సరఫరా చేస్తే ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. దీనికి కూడా పెట్టుబడి పెట్టే అవసరం ఎక్కువగా ఉండదని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య చాలామంది ప్రజలు ఇంగ్లీష్ వైద్యం కంటే ఆయుర్వేద వైద్యం కు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

మెడిసిన్స్ వాడటం కంటే ఆయుర్వేద మందులు వాడటం వల్ల తమకు అనారోగ్య సమస్యలు తక్కువ అవడంతో దేశంలో ఔషధ మొక్కలను పెంచటానికి రైతులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దీని వల్ల కూడా ఎక్కువ పెట్టుబడి ఉండకపోగా.. కొంతవరకు ఔషధ మొక్కలను పెంచితే చాలు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని ముందు అడుగులు వేస్తున్నారు. కాబట్టి మీరు కూడా తక్కువ పెట్టుబడి తో లాభాలు పొందాలనుకుంటే ఈ 5 రకాల పంటలను సులువుగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరి కొన్నిరకాల తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి.

click me!