Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య వర్సెస్ నాగబాబు మధ్యలో శ్రీరెడ్డి వీడియో!

గత కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు నాగబాబు. ఇప్పుడు బాలయ్య కామెంట్స్ కి కౌంటర్స్ అంటూ వీడియోలను వదులుతున్నాడు. 

sri reddy shares a video over balakrishna, nagababu controversy
Author
Hyderabad, First Published Jan 7, 2019, 11:20 AM IST

గత కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు నాగబాబు. ఇప్పుడు బాలయ్య కామెంట్స్ కి కౌంటర్స్ అంటూ వీడియోలను వదులుతున్నాడు. ఓ పక్క ఈ వివాదం ముదిరిపోతుంటే మరోపక్కన శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో ఈ వివాదానికి సంబంధించి ఓ కామెడీ వీడియో పోస్ట్ చేసింది.

''జబర్దస్త్ కామెడీ షో జడ్జి పాపం బాలయ్య బాబు ఫ్యాన్స్ చేతిలో పడితే సీన్ ఇలా ఉంటాది'' అంటూ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నాగబాబు ఒళ్లంతా గాయాలతో కట్లు కట్టుకొని ఉండగా.. ఆయనను పరామర్శించడానికి వచ్చిన వారిని నన్ను ఎవరు కొట్టారని అడుగుతాడు నాగబాబు.

వారు బాలయ్య ఫ్యాన్స్ కొట్టారని చెబుతారు. ఎందుకు కొట్టారని, ఎలా కొట్టారని అడిగితే.. సోషల్ మీడియాలో బాలయ్య బాబుపై రాసినందుకే దబిడి దిబిడే అయిందని, బాలయ్య బాబు ఫ్యాన్స్ కుళ్లబొడిచారని వాళ్లు చెబుతారు. చివరకు జై బాలయ్య అంటే వదిలేశారని చెబుతారు. 

ఇంతలో మరో బ్యాచ్ వస్తుందని.. జై బాలయ్య అని అరవాలని సూచిస్తారు. జై బాలయ్య జైజై బాలయ్య అనే నినాదాలతో వీడియో ముగించారు. ఈ వీడియో చూసిన మెగాభిమానులు శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. నీ పని నువ్ చూస్కో.. ఇదంతా నీకు అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. 

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios