Asianet News TeluguAsianet News Telugu

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

గత కొద్ది రోజులుగా దక్షిణాదిన హాట్ టాపిక్ గా నడిచిన విజయ్  ‘సర్కార్‌’ సినిమా వివాదం రెండు రోజుల క్రితమే ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. 

Bhagyaraj's statement on Sarkar story issue's final judgement at Court
Author
Hyderabad, First Published Nov 3, 2018, 9:28 AM IST

గత కొద్ది రోజులుగా దక్షిణాదిన హాట్ టాపిక్ గా నడిచిన విజయ్  ‘సర్కార్‌’ సినిమా వివాదం రెండు రోజుల క్రితమే ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే.  అంతా చల్లారింది అనుకున్న టైమ్ లో ఆ వివాదం కొత్త మలుపు తిరిగింది.  దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘం అధ్యక్షుడు గా  ఈ కథపై మాట్లాడిన ప్రమఖ దర్శక,రచయిత కె.భాగ్యరాజ్‌ మెడకు చుట్టుకుంది. ఆయన కథ ని లీక్ చేసారంటూ విమర్శలు వచ్చాయి.  దాంతో క్షమాపణ చెప్పి ఆ పదవికి రాజీనామా చేశారు. 

 మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ‘సర్కార్‌’ సినిమా కథ విషయంలో భాగ్యరాజా విమర్శలు ఎదుర్కొన్నారు. ‘సర్కార్‌’ కథకు, రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ కథకు పోలికలున్నాయని భాగ్యరాజా స్టేట్‌మెంట్‌ ఇవ్వటమే సమస్యగా మారింది.   'సర్కార్‌' సినిమా కథ, 'సెంగోల్‌' కథ ఒకటేనని ఆ చిత్రం స్టోరీని మీడియా ముందు చెప్పాడు. సినిమా కథను బయటకు చెప్పడంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ క్షమాపణ కోరింది. ఈ సందర్భంగా భాగ్యరాజ్‌ క్షమాపణలు చెప్పారు. తాజాగా ఎస్‌ఐడబ్ల్యూఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఈ విషయమై పలురకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నాననీ, అందుకే అధ్యక్ష పదవి నుంచి పక్కకు తపుకుంటున్నాననీ ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  ‘‘సంఘం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పలు విషయాలను నేను వ్యక్తం చేయడం లేదు. ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడమే నాపై ఒత్తిడి పెరగడానికి కారణం అనుకుంటున్నా. భవిష్యత్తుల్లో స్వచ్ఛందంగా పోటీ చేసి గెలుస్తా. ది బెస్ట్‌ అనేలా పని చేస్తా’’ అని భాగ్యరాజ్‌ చెప్పారు. 

సర్కార్ సినిమా ప్రభావంతేనే  భాగ్యరాజ్‌ రాజీనామా చేసాడనే విషయం కొట్టిపారేసారు. ఆయన  మాట్లాడుతూ రాజీనామా అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, సర్కార్‌ సినిమా వివాదంతో దీనికి సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు ఆపండి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి.. 

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!

Follow Us:
Download App:
  • android
  • ios