సిద్ధిపేట జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ఇద్దరు మృతి
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండలం జాలిగామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండలం జాలిగామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బైక్ పై ఉన్న ముగ్గురిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులను కొత్తపల్లి గ్రామానికి చెందన మంద ప్రసాద్ (20), ఎర్రోళ్ల డేవిడ్ (20)లుగా గుర్తించారు. వంగ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.