వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో సవితాశ్రీ భాస్కర్‌కి కాంస్యం... ఆ ఇద్దరి తర్వాత...
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన సవితాశ్రీ భాస్కర్... విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి తర్వాత మూడో భారత చెస్ ప్లేయర్‌గా రికార్డు..
భారత చెస్ ప్లేయర్, 15 ఏళ్ల సవితాశ్రీ భాస్కర్ చరిత్ర క్రియేట్ చేసింది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐడీఈ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది సవితాశ్రీ భాస్కర్. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మూడో భారత చెస్ ప్లేయర్‌గా నిలిచింది సవితాశ్రీ భాస్కర్..
ఇంతకుముందు భారత గ్రాండ్ మాస్టర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, మహిళా చెస్ ప్లేయర్ కొనేరు హంపి మాత్రమే వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచారు. కొనేరు హంపి తర్వాత వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన రెండో మహిళా ప్లేయర్‌గా నిలిచింది సవితాశ్రీ భాస్కర్...
36వ సీడ్‌తో మొట్టమొదటిసారిగా వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నీల్లో పాల్గొన్న సవితా శ్రీ భాస్కర్, 11 మ్యాచుల్లో 8 విజయాలు అందుకుని రెండు డ్రాలు చేసుకుని కాంస్యం గెలిచింది.. వరల్డ్ 79వ ర్యాంకులో ఉన్న సవితాశ్రీ భాస్కర్, ఈ విజయంతో కాంస్య పతకంతో పాటు 13 వేల డాలర్లు (10 లక్షల 76 వేల రూపాయలకు పైగా) ప్రైజ్ మనీగా దక్కించుకుంది..
రెండు నెలల గ్యాప్‌లో 3 వందలకు పైగా పాయింట్లు సాధించి, చెస్ వరల్డ్ దృష్టిలో పడింది సవితా శ్రీ భాస్కర్. సవితా శ్రీ భాస్కర్ తండ్రి భాస్కర్, సింగపూర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కూతురి కోసం ఉద్యోగం వదిలేసి స్వదేశానికి వచ్చేశాడు భాస్కర్. తమిళనాడుకి చెందిన సవితా శ్రీ భాస్కర్, 2007లో జన్మించింది..