Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్ రేప్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఆలస్యం.. బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. ఇద్దరు పోలీసుల సస్పెండ్...

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం కావడంతో బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణమైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

FIR delayed in gang rape case, Victim's father commits suicide.. Two policemen suspended in Uttarpradesh - bsb
Author
First Published Jun 8, 2023, 7:23 AM IST

గ్యాంగ్‌రేప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారనే ఆరోపణపై ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఇద్దరు పోలీసు అధికారులు సోమవారం సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒకరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బాలిక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మైనర్ అయిన బాలిక మీద మార్చి 28న గ్యాంగ్ రేప్ జరిగింది. బర్త్ డే పార్టీకి తీసుకెళ్తానని చెప్పి గోలు (30), దేవేంద్ర (32) అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారినుంచి తప్పించుకుని.. ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది. అయితే, బాలిక తల్లిదండ్రులు ఆ సమయంలో పని కోసం పంజాబ్‌ వలస వెళ్లారు. వారు మే 31 న తిరిగి వచ్చిన తర్వాత, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే ఐదు రోజులుగా స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తండ్రి ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు తన భర్తపై ఒత్తిడి తెచ్చారని యువతి తల్లి ఆరోపించింది.

విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి

ఆ కుటుంబం శనివారం ముఖ్యమంత్రి 'జన్సున్వాయి' పోర్టల్‌లో వారి ఫిర్యాదును అప్ లోడ్ చేసింది, దాని తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తండ్రి మృతికి కారణమైన నిందితులను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు గ్యాంగ్‌రేప్ నిందితులను కూడా అరెస్టు చేశారు. విచారణను కొంచ్ సర్కిల్ అధికారి (CO)కి అప్పగించారు. సస్పెండ్ చేయబడిన అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, జూన్ 1న ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటనే వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు కాలిన గాయాలకు గురైంది. దీంతో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె జూన్ 1 నాడు ప్రాణాలు విడిచింది. అత్యాచారానికి ఎదురు తిరగడంతో ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు దుర్మార్గులు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తండ్రి ఆస్పత్రిలో చేర్పించడంతో రెండు నెలలుగా ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని గుజరాత్ లోని సూరత్ కు తీసుకువెళ్లారు. మరోవైపు విద్యార్థిని కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

మహావీర్ మీద అనుమానం ఉందని.. తన  కూతురు అదృశ్యానికి అతనికి సంబంధం ఉండొచ్చని తెలపడంతో.. అతను, అతని స్నేహితుల మీద.  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మార్చి 28న మహావీర్ అతని స్నేహితులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఎదురు తిరిగింది. కోపానికి వచ్చిన నిందితుడు ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

ఆ తర్వాత ఈ విషయాన్ని విద్యార్థినిని కిడ్నాప్ చేసిన  మహా వీరే  స్వయంగా బాధితురాలు తండ్రికి ఫోన్ చేశాడు. అతని కూతురు తీవ్ర గాయాల పాలయిందని తెలిపాడు. దీంతో మార్చి 29న బాధితురాలు తండ్రి సుల్తాన్పూర్ ఎస్పీ సోమన్ వర్మను కలిసి.. ఘటన మొత్తాన్ని వివరించాడు.  దీంతో వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సూరత్ వెళ్లారు. అక్కడ  మహావీర్ చెప్పిన గుర్తుల ప్రకారం బాధితురాలి ఆచూకీ కనుక్కుని.. ఆమెను లఖ్ నవూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా మారి గాలించారు.  వీరిలో ప్రధాన నిందితుడైన మహావీర్.. అతని స్నేహితుడైన ధనిరామ్ లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటినుంచి  60 శాతానికి పైగా  కాలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతుంది. మంగళవారం రాత్రి  మృతి చెందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios