Google Server Down: ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సెర్చ్ సర్వర్ డౌన్ అయ్యింది. బుధవారం రాత్రి గూగుల్ హఠాత్తుగా డౌన్ అయింది. గూగుల్ డౌన్ అయిన వెంటనే, ప్రజలు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. Google డౌన్ అయిన ప్రభావం Google యొక్క అన్ని సర్వీస్‌లలో కనిపించింది.

Google డౌన్ అయిన వెంటనే, వినియోగదారులు Chromeలో ఏదైనా శోధించడంలో, Google Mapలో దిశలను కనుగొనడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.  వినియోగదారులు ఫిర్యాదుల ప్రకారం.. భారత్ లో రాత్రి 8:20 గంటల నుండి Google సెర్చ్ ఇంజన్ లో సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు బెంగళూరులలో అంతరాయాలు నివేదించబడ్డాయి.

గూగుల్ డౌన్ అయిన తర్వాత, చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇతర వెబ్‌సైట్‌ల అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ కూడా గూగుల్ డౌన్‌లో ఉందని ధృవీకరించింది.