అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శనివారం ఉదయం డెలావేర్ రాష్ట్రంలోని తన బీచ్ హోమ్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అయితే ఇదేమీ పెద్ద యాక్సిడెంట్ కాదు. ఇంతకీ ఏం జరిగిందంటే..  బిడెన్ బీచ్ సమీపంలో పలువురు సిటిజన్స్ మరియు ఒకరిద్దరూ సిబ్బందితో కలిసి బైస్కిల్ పై రైడ్ చేశారు. అయితే క్రమంలో తను  రైడ్ ముంగించుకునే సమయంలో బిడెన్ బ్యాలెన్స్ అదుపు తప్పి సైకిల్ పై నుంచి ఒక్కసారిగా కింద పడ్డాడు. సిబ్బంది, ఇతరులు  చూస్తుండగానే బిడెన్ కింద పడిపోవడంతో అందరూ ఆయన వద్దకు చేరుకున్నారు. ఏమైందంటూ కాస్తా కంగారు పడ్డారు. 

కానీ, ఆయన మాత్రం తానే స్వయంగా పైకి లేచాడు. తన వద్దకు వచ్చిన వారితో అదే స్పాట్ లో ఐదు నుంచి పది నిమిషల వరకు మాట్లాడారు. ‘నేను బాగున్నాను’ అని అక్కడి వారికి చెప్పాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైట్ హౌస్ పూల్ నుంచి ఇంటర్నెట్ లోకి చేరింది.  ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. 79 ఏండ్లు ఉన్న బిడెన్ కు ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ ఆందోళన చెందారు. మరోవైపు "వైద్య సంరక్షణ అవసరం లేదు’ అని వైట్ హౌస్ అధికారి ఒకరు ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని,  రోజంతా తన కుటుంబంతో బాగానే గడిపారని తెలిపారు. 

అసలు బిడెన్ ఎలా కిందపడ్డాడంటే.. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించే జో బిడెన్ డెలావేర్ రాష్ట్రంలోని తన బీచ్ హోమ్ సమీపంలో శనివారం ఉదయం సైకిలింగ్ చేస్తున్నాడు.  తిరిగి ఎండ్ పాయింట్ కు చేరుకున్నాడు. అయితే సైకిల్ నుంచి కిందికి దిగే సమయంలో.. ఎడమ కాలును ముందుగా నేలపై మోపాడు. ఆ తర్వాత కుడి కాలును పైడిల్ నుంచి తీసే క్రమంలో బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా బలంగా కిందపడ్డాడు. ఆ తర్వాత తానే స్వయంగా పైకి లేచాడు. తనకేమీ కాలేదని తెలిపాడు. తలకు హెల్మెట్ కూడా ధరించడంతో పెద్దగా గాయాలేమీ కాలేదు. 

గతంలోనూ బిడెన్ ప్రమాదానికి గురయ్యాడు. నవంబర్ 2020లో బిడెన్ తన పెంపుడు జర్మన్ గొర్రెల కాపరులతో ఆడుకుంటున్ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స పొందిన  ఆయన కోలుకున్నాడు. సరిగ్గా ఏడాది తర్వాత   నవంబర్ 2021లో తన వైద్యుడు బిడెన్‌కు ఆరోగ్యానికి సంబంధించిన క్లీన్ బిల్లును ఇచ్చాడు. బిడెన్ ను ‘ఆరోగ్యకరమైన’ మరియు ‘శక్తివంతంగా’ అభివర్ణించాడు. ఏదేమైనా బైడెన్ తన ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహిస్తుంటాడు. ఇక 2024లో రెండోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోనే ఉన్నారు.