చదువు నుండి ప్రతి ఒక్క విషయంలో కులం, మతం అనే బేధాలు చూస్తుంటారు. నిజానికి ప్రభుత్వమే కులం గురించి ప్రస్తావించినప్పుడు సామాన్య ప్రజలు అటువంటి ఫీలింగ్ నుంచి ఎలా బయట పడతారు చెప్పండి. పైగా వేర్వేరు మతాలకు సంబంధించిన ఆలయాలను కూడా ఒక చోట కట్టడానికి ఇష్టపడరు.

అలాంటిది..  మతాలు ఎక్కడ కలుస్తాయని చెప్పాలి. ఇటువంటి సమస్య ఇప్పటిది కాదు.. మునుపటి నుంచి ఈ తీరు ఇలాగే ఉంది. ఇక దానినే ఇప్పటి ప్రజలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి కులాంతర ప్రేమ వివాహాల వల్ల కొన్ని కులాలు మాత్రమే కొంతవరకు మాత్రమే కలుస్తున్నాయి. మిగతా మొత్తం కులమనే ఫీలింగ్, మతమనే ఫీలింగ్ నడుస్తుంది. అటువంటి కాలంలో గడుపుతున్న మనం మారడానికి క్షణం పట్టదు.

అలా ఇప్పటికే కొన్ని మతాలు ఇతర మతాలతో సంబంధాలు కలుపుకుంటూ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇంత బేధాలు ఉన్న ఈ సమాజంలో.. ఏకంగా హిందూ దేవుడికి ముస్లిం సోదరులు పూజలు చేసి అందరం ఒకటే అనే భావనను కలిగించారు. ఇంతకూ అసలు విషయం ఏంటంటే.. ఈరోజు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా హిందూ ప్రజలంతా ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి నైవేద్యం సమర్పించి, దేవుని స్మరిస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఆలయాలు భక్తి పూజలతో కిటకిటలాడుతున్నాయి. ఇక తాజాగా తిరుమల ఆలయంలో ముస్లిం సోదరులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల తొలి గడప దేవుని కడప ఆలయంలో ముస్లిం సోదరులు పూజలు నిర్వహించారు. స్వామి వారి ముస్లిం అత్తింటివారు శ్రీ వెంకటేశ్వర స్వామి కి సారే ఇచ్చి ఉగాదికి  తమ ఇంటికి ఆహ్వానించారు.

బీబీ నాంచారమ్మ ముస్లిం తమ ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తుంది. అలా శ్రీనివాసుడిని మతం అనే భేదం లేకుండా ముస్లిం సోదరులు పూజిస్తుంటారు. బీబీనాంచారమ్మ.. తుళుక్క నాచ్చియార్ అనే ముస్లిమ్ స్త్రీ. శ్రీరంగం రంగనాధుని భక్తురాలిగా తన జీవితం మొత్తం ఆయన సేవకే అంకితం చేసింది. భూదేవి బీబీనాంచారి గా అవతారం ఎత్తి శ్రీవారి కోసం వచ్చింది. మహమ్మదీయుల పాలన కాలంలో తిరుపతి దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రల నుండి రక్షించడానికి ఈ కథ ఏర్పడిందని తెలుస్తోంది.

ఇక అలా అప్పటి నుంచి బీబీ నాంచారమ్మ తమ ఆడబిడ్డగా భావించుకొని ఇప్పటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు. కేవలం తిరుమల లోనే కాకుండా ఇతర వెంకటేశ్వర ఆలయాలలో కూడా ముస్లిం సోదరులు  స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల హిందూ సోదరులు కూడా ముస్లిం దైవాన్ని కొలుస్తుంటారు. అలా ప్రతి ఉగాదికి తొలి గడప పూజలు చేసి స్వామి వారిని పండుగకు ఆహ్వానిస్తారు.