Asianet News TeluguAsianet News Telugu

ఒకే పండుగ తిథి రెండు రోజులు వస్తే ..ఏ రోజు జరుపుకోవాలి?

సాధారణంగా సూర్యోదయ స్పర్శ కలిగిన తిధి పండగలు జరపటం వేద విజ్ఞానం కలిగిన మన పెద్దలు అనుసరిస్తున్న సంప్రదాయం.

How to get Clarity from Festival Day Confusion ram jvr
Author
First Published Nov 4, 2023, 10:17 AM IST | Last Updated Nov 4, 2023, 10:17 AM IST

ఈ మధ్యకాలంలో  తెలుగు రాష్ట్రాల్లో పండుగ విషయాల్లో ఎప్పుడు ఏదో ఒక గందరగోళం కనిపిస్తూనే ఉంది. పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అని అందరూ తర్జన భర్జన పడాల్సి వస్తోంది.  ఒక్కో క్యాలండర్ లో ఒక్కో విధంగా పండుగ తేదీలను పేర్కొన్నారు.  2023 వ సంవత్సరంలో అధికమాసం ఏర్పడటం వల్ల పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత ఏర్పడిందనేది నిజం. ఏరోజు ఏ పండుగ వస్తుందో జనాలకు అర్దం కావడం లేదు.  ఒకరు ఒక రోజు పండుగ అంటే మరొకరు అదే పండుగ ఇంకో రోజంటున్నారు. దీంతో  అసలు ఏ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక గందరగోళ స్థితిలో ఉన్నారు. .పండగ ఘడియలు ఎప్పుడు ప్రవేశిస్తాయనేది  గందరగోళం నెలకొనటమే కారణం. తిథులు, పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండుగ, శుభ ఘడియలు రెండు రోజుల పాటు ఉంటున్నాయి. ఈ క్రమంలో  వినాయిక చవితి, దసరాకు, కృష్ణాష్టమి పండుగ విషయంలో ఆ పండగలు ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫూజన్ నెలకొనడం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పుడు ఫలానా రోజు పండగ చేసుకోవాలని ప్రకటనలు వచ్చాయి.  ఇలాంటి సమయాల్లో ఏ రోజు పండగ జరపాలి అనే విషయాన్ని పండితులు ఏ ఆధారాలతో నిర్ణయం చేస్తూంటారో చూద్దాం.

How to get Clarity from Festival Day Confusion ram jvr

సాధారణంగా సూర్యోదయ స్పర్శ కలిగిన తిధి పండగలు జరపటం వేద విజ్ఞానం కలిగిన మన పెద్దలు అనుసరిస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలో కృష్ణాష్టమిని మనం చూసినట్లైతే సెప్టెబర్ ఆరవ తేదీ బుధవారం రాత్రి 8 గంటల ఏడు నిముషాల వరకూ సప్తమీ తిధి ఉంది. తర్వాత  మాత్రమే అష్టమి వచ్చింది. దాంతో  కృష్ణాష్టమి జరపాలా బుధవారం జరపాలా లేక గురువారంఅనే సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడు అష్టమి తిధి నాడు అర్దరాత్రి రోహిణి నక్షిత్రంలో పుట్టాడు. కాబట్టి అష్టమి తిధి అర్దరాత్రి వేళ ఉండటం ముఖ్యం. రోహిణి నక్షిత్రం కలిసినచో మరీ శ్రేష్టం. రోహిణి నక్షిత్రం ఉన్నా లేకపోయినా తిధి ప్రాదాన్యత. అర్దరాత్రి ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజే కృష్ణాష్టమిగా నిర్ణయించబడింది. దాంతో బుధవారమే కృష్ణాష్టమిగా నిర్ణయించటం జరిగింది.

వినాయిక చవితి పండగ కనుక తీసుకుంటే ...చవితి తిధి మధ్యాహ్నం వ్యాప్తి గలగిన రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజుని వినాయిక చవితి పండగగా నిర్ణయిస్తారు. 2023లో వచ్చిన వినాయిక చవితి ఆ రోజు ఉదయం 10 గంటల 15 నిముషాలకు చవితి తిధి వచ్చింది. తర్వాత రోజు 10 గంటల 43 వరకూ ఉంది. అయితే ఇక్కడ ముందు రోజు తిథి ఎక్కువ వ్యాప్తి గలిగి ఉండటంతో ఆ రోజుని వినాయిక చవితి జరుపుకోవాలని నిర్ణయించటం జరిగింది.

దసరా నవరాత్రులు విషయానికి వస్తే... సోమవారం విజయదశిమి చేయాలా లేక మంగళవారం చేయాలా అనే సందేహం వచ్చింది. దసమి తిథి రెండు రోజులు మధ్యాహ్యానికి వ్యాపించి ఉన్నట్లైతే ముందు రోజే విజయదశమి నిర్ణయిస్తారు. శ్రవణా నక్షిత్రం తర్వాత రోజు వచ్చినా ముందు రోజే దసమి గా నిర్ణయిస్తారు. ఇక్కడే తిథి ప్రాధాన్యత. లేదా రెండు రోజులు దశమి తిథి అపహ్నానికి లేకపోయినా కూడా, శ్రవణా నక్షిత్రం లేకున్నా కూడా ముందు రోజే విజయదశమి చేయాలి.ఈ రోజు సంవత్సరం సోమవారం (23 వ తేదీ) 3 గంటల 23 నిముషాలకి దశమి తిథి వచ్చింది. తర్వాత రోజు 24  వ తేదీ మంగళవారం 12 గంటల 48 నిముషాల వరకూ దశమి ఉంది.  మూడు ముహూర్తాలు జరిగిన దశమి తిథి ఏ రోజైతే ఉంటుందో విజయదశమిగా నిర్ణయించటం జరుగుతుంది. కావున ఈ సంవత్సరం 24 మంగళవారం విజయదశమి గా నిర్ణయించారు. ఇలా పండితులు ఒక్కో తిధిని సంభందించిన ప్రాధాన్యతను బట్టి ఆయా పండగలను నిర్ణయంచటం జరుగుతుంది.


--
జోశ్యుల రామకృష్ణ 
 ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు
.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios