పాదాల పగుళ్లను తగ్గించే సూపర్ చిట్కాలు మీకోసం
చలికాలంలో బాడీ డీహైడ్రేట్ కావడమే కాదు.. చర్మం కూడా పొడిబారుతుంది. అంతేకాదు మడమలు కూడా పగలడం స్టార్ట్ అవుతుంది. వీటికి సకాలంలో చికిత్స చేయకపోతే పగుళ్లు ఎక్కువై వాటిలోంచి రక్తం కారే ప్రమాదం కూడా ఉంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.
cracked heels
చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే సర్వ సాధారణ సమస్య పాదాల పగుళ్లు. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ సమస్య ఏడాది పొడవునా ఉంటుంది. ఇది మడమల పగుళ్లతో ప్రారంభమై చీము ఏర్పడటం, రక్తస్రావం వంటి సమస్యల వరకు వెళుతుంది. ఈ పాదాల పగుళ్లు ఎక్కువగా చలికాలంలోనే ఉంటుంది. అయితే ఏడాది పొడవునా ఈ సమస్యతో బాధపడేవారి శరీరంలో విటమిన్ -ఎ, విటమిన్ బి, విటమిన్ సి లోపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్య ఏంటని తెలుసుకోవడానికి డాక్టర్ ను సంప్రదించి తెలుసుకోవాలని గుర్తుంచుకోండి.
పాదాల పగుళ్లు
కొన్ని కొన్ని సార్లు చల్లని వాతావరణం మాత్రమే కాదు కొన్ని వ్యాధుల వల్ల కూడా పాదాలు పగుళ్లు వస్తాయి. ఉదాహరణకు, సోరియాసిస్, ఆర్థరైటిస్, థైరాయిడ్ ఉన్నవారిలో మడమలు త్వరగా పగుళుతాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీనికి వీలైనంత త్వరగా చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో వీచే పొడి గాలులు.. మన ముఖాన్నే కాదు శరీరంతో పాటుగా చీలమండలను కూడా దెబ్బతీస్తాయి. అందుకే ముఖాన్ని, శరీరంతో పాటుగా పాదాలను కూడా వెచ్చగా, మృదువుగా ఉంచండి. మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
Cracked Heels
పోషకాలను తీసుకోండి
మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు చాలా చాలా అవసరమవుతాయి. ఎలాంటి సమస్యనైనా దూరం చేసుకోవాలంటే ముందుగా పోషకాలను పుష్కలంగా తీసుకోవాలి. మీరు తినే ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్ లు మెండుగా ఉండేట్టు చూసుకోండి.
పాదాల పగుళ్లు
స్క్రబ్
మడమల పగుళ్లను తగ్గించుకోవాలంటే మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత స్క్రబ్బింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఆ తర్వాత పెట్రోలియం జెల్లీని మడమలపై అప్లై చేయండి.
కలబంద జెల్
మీ పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి.. తర్వాత టవల్స్ తో తుడవండి. మడమలు పూర్తిగా ఆరిన తర్వాత కలబంద తాజా ఆకుల నుంచి తీసిన జెల్ ను అప్లై చేసి సాక్స్ లను వేసుకోండి. ఉదయాన్నే మీ పాదాలను సాధారణ నీటితో కడగండి. ఇది కూడా పగుళ్లు తగ్గడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నూనె
పగిలిన మడమలను కొబ్బరి నూనెతో రాత్రిపూట మసాజ్ చేయండి. సాక్సులను వేసుకుని నిద్రపోండి. ఇది కూడా పగుళ్లను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పొద్దున్నే తేడాను కూడా గమనిస్తారు.
మాయిశ్చరైజ్
పాదాల పగుళ్లను వదిలించుకోవడానికి వీటిని ఎప్పుడూ తేమగా ఉంచడం చాలా అవసరం. నిపుణుల ప్రకారం.. రోజూ మాయిశ్చరైజ్ చేస్తే మడమలు పగిలే అవకాశం ఉండదు.