MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చాహల్.. పంజాబ్ హీరో రికార్డుల మోత

IPL 2025: చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చాహల్.. పంజాబ్ హీరో రికార్డుల మోత

PBKS vs KKR: ఐపీఎల్ 2025లో తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఉత్కంఠ కొన‌సాగింది. మొత్తానికి కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి మ్యాచ్ ను 16 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుచుకుంది. పంజాబ్ టీమ్ తో పాటు స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు.  

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 16 2025, 01:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Yuzvendra Chaha: ఐపీఎల్ 2025లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ తక్కువ స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ టీమ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రియల్ హీరోగా నిలిచాడు. అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను గెలిపించి పంజాబ్ 'కింగ్' తానే అని సూపర్ ఫామ్ అందుకుంటూ నిరూపించాడు. 

చండీగఢ్ లోని ముల్లాన్పూర్ మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2025 31వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై సంచలన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ ను మలుపు తిప్పింది భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ కెపప్టెన్సీలోని పంజాబ్ టీమ్ తొలుత మ్యాటింగ్ చేసి 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ ఎవరూ ఊహించని విధంగా 95 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతా 7 ఓవర్లలో 60/2 స్కోరుతో నెమ్మదిగా విజయాన్ని దిశగా కదులుతుండగా, చాహల్ వచ్చి మ్యాచ్ ను మార్చిపడేశాడు. కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది.  పంజాబ్ టీమ్ 16 పరుగుల తేడాతో అజింక్య రహానే కెప్టెన్సీలోని కోల్ కతాపై గెలిచింది.

35

ఈ మ్యాచ్‌లో చాహల్ ఫామ్ ను అందుకుంటూ తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ ను బందించాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి, మ్యాచ్‌ను పూర్తిగా పంజాబ్ వైపు తీసుకువచ్చాడు. ఈ అద్భుత ప్రదర్శనతో చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సునిల్ నరైన్ సరసన చేరాడు.

IPLలో అత్యధిక 4+ వికెట్లు సాధించిన బౌలర్లు 

8 – యుజ్వేంద్ర చాహల్  
8 – సునిల్ నరైన్ 
7 – లసిత్ మలింగ  
6 – కగిసో రబాడ  
5 – అమిత్ మిశ్రా  

అలాగే, చాహల్ మరో కొత్త రికార్డు కూడా సాధించాడు. ఈ మ్యాచ్‌లో తీసిన 4 వికెట్ల ప్రదర్శనతో కలిపి చాహల్‌కు కేకేఆర్ పై మూడో సారి 4 వికెట్ల ప్రదర్శనలు ఇచ్చాడు. అంటే ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సార్లు 4+ వికెట్లు సాధించిన బౌలర్ గా ఘనత సాధించాడు.

45

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు కలిగిన చాహల్.. భువనేశ్వర్ కుమార్ రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఒక టీమ్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల టాప్ 10 జాబితాలో చోటుదక్కించుకున్నాడు. 

36 – సునిల్ నరైన్ vs PBKS  
35 – ఉమేష్ యాదవ్ vs PBKS  
33 – డ్వైన్ బ్రావో vs MI  
33 – మోహిత్ శర్మ vs MI  
33 – **యుజ్వేంద్ర చాహల్ vs KKR**  
32 – **యుజ్వేంద్ర చాహల్ vs PBKS**  
32 – భువనేశ్వర్ కుమార్ vs KKR  

55

మ్యాచ్ ముగిసిన తర్వాత చాహల్ భావోద్వేగంతో మాట్లాడాడు.. "ఇది ఒక జట్టు విజయం. మేము పాజిటివ్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాం. పవర్‌ప్లేలో 2-3 వికెట్లు పడితే మ్యాచ్ మాదేనని అనుకున్నాం. మా బ్యాటింగ్ సమయంలో వాళ్ల స్పిన్నర్లు టర్న్ పొందింది చూసాం, అలాగే మా స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరించింది. మొదటి బంతి నుంచే టర్న్ రావడంతో, శ్రేయస్ అయ్యరు 'స్లిప్ కావాలా?' అని ఆడిగాడు. మేము దూకుడుగా ఆడాలనుకున్నాం, ఎందుకంటే ఇది తక్కువ స్కోరింగ్ మ్యాచ్.. గెలవాలంటే వికెట్లు తీసుకోవాల్సిందే" అని చాహల్ అన్నారు.

అలాగే, "గత మ్యాచ్‌లో నేను 56 పరుగులు ఇచ్చాను, కానీ నాపై నాకున్న నమ్మకం తగ్గలేదు. నాకు ఎప్పుడూ ఒకే లక్ష్యం – బ్యాటర్లను ఔట్ చేయాలి. పేస్ వేరియేషన్లు పెడతాను, వాళ్లు సిక్స్ కొట్టాలంటే కష్టపడాల్సిందే" అని చాహల్ అన్నాడు. 

"ఇలాంటి గేమ్‌లో గెలవడం వల్ల టీమ్ మోరల్ చాలా పెరుగుతుంది. ఇది పంజాబ్ తరపున నా మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. నా నైపుణ్యాలను విశ్వసిస్తాను, అలా చేస్తే విజయాలు ఖచ్చితంగా వస్తాయి" అని చాహల్ అన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved