- Home
- Sports
- Cricket
- IPL 2025: ముంబై ఇండియన్స్ మరో ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందా? రోహిత్ టీమ్ ను భయపెడుతున్నది ఏమిటి?
IPL 2025: ముంబై ఇండియన్స్ మరో ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందా? రోహిత్ టీమ్ ను భయపెడుతున్నది ఏమిటి?
IPL 2025 Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో 6వ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

Will Mumbai Indians win ipl 2025 title? What is scaring Rohit Sharma's team? Here are mumbai's strengths and weaknesses
IPL 2025 Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ (MI) తమ IPL 2025 లో తొలి మ్యాచ్ ను మార్చి 23 ఆదివారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో ఆడనుంది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్ గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ తన ఖాతాలో ఆరో ఐపీఎల్ టైటిల్ వేసుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది.
2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ నిరాశాజనకంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే, రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం కొత్త కొత్తగా సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ముంబై టీమ్ వేలంలో కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. అయితే, వీరితో 2025 సీజన్‌లో ముంబై టైటిల్ గెలుస్తుందా? ముంబై జట్టు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ముంబై ఇండియన్స్ బలం, బలహీనతలు ఏమిటి? ఈ టీమ్ ను భయపెడుతున్నది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం?
Will Mumbai Indians win ipl 2025 title? What is scaring Rohit Sharma's team? Here are mumbai's strengths and weaknesses
IPL 2025: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బలం ఏమిటి?
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్స్ లో ఒకటి. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన బలాల్లో బాటింగ్ లైన్-అప్ ఒకటి. ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లతో కూడిన బలమైన బాటింగ్ లైన్-అప్ ఉంది. రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్, విజయవంతమైన ఐపీఎల్ కెప్టెన్ గా టాప్ ఆర్డర్‌లో టీమ్ కు బలమైన ప్లేయర్. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు సమయానుకూలంగా తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడగలరు. హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ రూపంలో ఆల్ రౌండర్లు ఉన్నారు.
అలాగే, ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా ప్రధాన బలం అని చెప్పవచ్చు. ఈ టీమ్ అద్భుతమైన పేస్ బౌలింగ్ ను కలిగి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, రీస్ టోప్లీలలో ఏ ఒక్కరు చెలరేగినా ప్రత్యర్థి జట్లు పరుగులు చేయడం కష్టమే. బుమ్రా తమ తొలి మ్యాచ్ కు లేకపోయినా బౌల్ట్, చహర్ అనుభవం జట్టుకు కలిసివచ్చే అంశం.
IPL 2025: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బలహీనతలు ఏమిటి?
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బలంగా ఉంది. కానీ, ఆ జట్టు ప్రధాన బలహీనత స్పిన్ బౌలింగ్. ముంబై టీమ్ లో మిచెల్ సాంట్నర్ మాత్రమే నమ్మదగిన స్పిన్ బౌలర్ గా ఉన్నాడు. ఈ విభాగంలోని కర్ణ్ శర్మ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ల నుంచి స్థిరమైన స్పిన్ బౌలింగ్ ప్రదర్శనలు లేకపోవడం ముంబైని ఇబ్బందిపెట్టే విషయం. స్పిన్ లో వరుస ఇన్నింగ్స్ లలో కన్సిస్టెంట్‌గా రాణించకపోవచ్చు. మరీ ముఖ్యంగా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై జట్టుకు నష్టం కలగవచ్చు. ఈ విషయంలో ఐపీఎల్ 2025లో ముంబై జట్టుకు కష్టాలు రావచ్చు.
మరొక బలహీనత ముంబై ఇండియన్స్ ఎక్కువగా సీనియర్ ఆటగాళ్లపై ఆధారపడటం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లపై ముంబై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే, వీరు రాణించని సమయంలో జట్టు అస్థిరంగా ఉండి, ఇబ్బందులు పడుతుంది. బుమ్రా మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడంతో బౌల్ట్, చహర్ లపై ఎక్కువ భారం పడుతుంది.
Will Mumbai Indians win ipl 2025 title? What is scaring Rohit Sharma's team? Here are mumbai's strengths and weaknesses
ఐపీఎల్ 2025: ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
ఐపీఎల్ 2025 సీజన్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. గత సీజన్ లో దారుణ ప్రదర్శన ఇచ్చిన ముంబై జట్టు ఈ సారి హార్దిక్ పాండ్యా నాయకత్వంలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. 2024 సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా హార్దిక్ వచ్చిన తర్వాత ఆశించిన ఫలితాలను ఆ టీమ్ అందుకోలేదు. ఈ సీజన్‌లో కొత్త వ్యూహాలతో గెలుపు ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. గుజరాత్ టైటాన్స్‌ను IPL 2022, 2023 ఫైనల్స్‌కు తీసుకెళ్లిన హార్దిక్ పాండ్యా అనుభవం జట్టుకు ఉపయోగపడవచ్చు.
అలాగే, మరొక అవకాశం ముంబై ఇండియన్స్‌కు యువ ఆటగాళ్లను పెంచుకోవడం. రోబిన్ మింజ్, రాజ్ ఆంగద్ బవా, విజ్నేష్ పుతూర్ వంటి ఆటగాళ్లు విలువైన అనుభవాన్ని సంపాదించవచ్చు, ఇది జట్టుకు దీర్ఘకాలిక ప్రయాణంలో కీలక పాత్ర పోషించవచ్చు. ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లను పెంపొందించడంలో గతంలో విజయం సాధించింది. ఈ సీజన్‌లో కరెక్ట్ టాలెంట్‌ను కనుగొంటే ముంబై తన దీర్ఘకాలిక ప్రణాళికల్లో విజయం సాధించినట్టే.
ఐపీఎల్ 2025: ముంబై ఇండియన్స్ ను భయపెడుతున్నదేంటి?
ముంబై ఇండియన్స్‌కు అత్యంత ముఖ్యమైన ముప్పు జట్టు సమతూకమైన టీం కాంబినేషన్ లోపం. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతో పాటు బ్యాట్, బాల్ తో రాణించకపోతే జట్టులో పక్కాగా అస్థిరత కనిపిస్తుంది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మంచి టచ్ లో కనిపించాడు. కాబట్టి అతను ముంబై కి ఈ సీజన్ లో కెప్టెన్ గా, ఆల్-రౌండర్‌గా మంచి ప్రదర్శనలు ఇస్తాడని భావిస్తున్నారు. ఇది జరగకపోతే ముంబై మరోసారి మునుగుతుంది.
ముంబై జట్టును భయపెడుతున్న మరో విషయం స్థిరమైన ప్రదర్శనలు ఇవ్వడంలో ఫెయిల్ కావడం. గత 5 సీజన్లలో ముంబై జట్టు గొప్ప ప్రదర్శనలు ఇవ్వలేకపోయింది. 2020లో ఐపీఎల్ టైటిల్ సాధించిన తర్వాత మరోసారి అలాంటి ప్రదర్శన ఇప్పటివరకు ఇవ్వలేకపోయింది. 2023లో ఆరంభంలో తడబడినా ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ ప్లే ఆఫ్స్‌లో చేరింది. 2024లో మరోసారి దారుణ ప్రదర్శన ఇచ్చింది. ముంబై టీమ్ ఐపీఎల్ 2025 ఆరంభంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగకపోతే ఈ సీజన్ కూడా జట్టుకు కష్టమైనదిగా మారుతుంది.
Will Mumbai Indians win ipl 2025 title? What is scaring Rohit Sharma's team? Here are mumbai's strengths and weaknesses
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ లో చేరిన కొత్త ఆటగాళ్లు వీరే
ట్రెంట్ బౌల్ట్: క్రికెట్ ప్రపంచంలో పరిచయమక్కరలేని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్. తన స్వింగ్, పేస్ అటాక్ తో గుర్తింపు పొందాడు.
దీపక్ చహర్: భారత పేస్ బౌలర్. బాల్ ను స్వింగ్ చేయడంలో దిట్ట.
మిచెల్ సాంట్నర్ : న్యూజిలాండ్ స్టార్ ఆల్-రౌండర్, సాంట్నర్ స్పిన్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ తో అదరగొట్టగల ప్లేయర్.
రయాన్ రికెల్టన్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ దూకుడుగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. మిడిల్ ఆర్డర్ లో జట్టుకు బలమైన బ్యాటర్ ఆప్షన్.
రోబిన్ మిన్జ్: భారత యంగ్ వికెట్ కీపర్-బ్యాటర్. దేశీయ మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు.
బీవన్ జాకబ్స్: స్థిరమైన ఇన్నింగ్స్ లు ఆడగల సత్తా ఉన్న దక్షిణాఫ్రికా మిడిల్-ఆర్డర్ బ్యాటర్ జాకబ్స్ ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచగలడు.
అల్లా మహమ్మద్ ఘజాన్ఫర్: 18 ఏళ్ళ వయస్సులోనే అఫ్ఘన్ టీమ్ తరఫున ఎంట్రీ ఇచ్చిన ఈ ఆఫ్-స్పిన్నర్ లంక ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. అతని పై భారీ అంచనాలు పెట్టుకున్న ముంబై టీమ్ ₹4.80 కోట్లకు దక్కించుకుంది.
IPL 2025: ముంబై ఇండియన్స్ (MI) టీమ్ లోని కీలక ప్లేయర్లు ఎవరు?
రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్. రోహిత్ ముంబై టీమ్ లోని సీనియర్ స్టార్ ప్లేయర్. జట్టుకు అనేక సార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. అలాగే, ముంబై జట్టును చాలా సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు.
హార్దిక్ పాండ్యా: ముంబై టీమ్ కెప్టెన్, ఒక డైనమిక్ ఆల్‌రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడగల సత్తా ఉన్న ప్లేయర్.
సూర్యకుమార్ యాదవ్: సునామీ ఇన్నింగ్స్ లు ఆడగల సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. కెప్టెన్ గా అనుభవం ఉంది. మ్యాచ్ ను మలుపు తిప్పగల గొప్ప బ్యాటర్.
జస్ప్రీత్ బుమ్రా: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో గొప్ప ఫాస్ట్ బౌలర్. అతను బౌలింగ్ తో గొప్ప బ్యాటర్లను సైతం ఇబ్బంది పెట్టగలడు. జట్టుకు అద్భుతమైన విజయాలు అందించే సత్తా ఉన్న ప్లేయర్.
ట్రెంట్ బౌల్ట్: న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రపంచ క్రికెట్ లో ఒక స్టార్ బౌలర్. న్యూజిలాండ్ కు తన బౌలింగ్ తోనే అనేక విజయాలు అందించాడు.
తిలక్ వర్మ: టీమిండియా యంగ్ ప్లేయర్. ఒత్తిడి తట్టుకుని అద్భుతమైన ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడగల ప్లేయర్. ముంబై బ్యాటింగ్ లైనప్ లో గొప్ప బలం.
మిచెల్ సాంట్నర్: న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్. అలాగే, లోవర్-ఆర్డర్ పరుగులు చేయగల బ్యాటర్.
విల్ జాక్స్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్. దూకుడైన బ్యాటింగ్, అవసరమైన సమయంలో బౌలింగ్ తో కూడా అద్భుతాలు చేయగల ప్లేయర్.