MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: 50 ఏళ్ల‌లో ఒకే ఒక్క‌డు.. మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కొత్త రికార్డు

IND vs ENG: 50 ఏళ్ల‌లో ఒకే ఒక్క‌డు.. మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కొత్త రికార్డు

India vs England: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తో భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వ‌న్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తూ మ‌రో రికార్డు సాధించాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 09 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Varun Chakaravarthy

Varun Chakaravarthy

Varun Chakravarthy: ఇంగ్లాండ్ తో జ‌రిగిన టీ20 సిరీస్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టిన భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వ‌న్డే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 33 ఏళ్ల స్పిన్నర్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. భార‌త సీనియ‌ర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చేతుల మీదుగా తన తొలి వన్డే క్యాప్‌ను అందుకున్నాడు.

25

కొత్త రికార్డు సాధించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేతో వన్డే అరంగేట్రం చేశాడు. 33 సంవత్సరాల 164 రోజుల వయసులో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1974లో ఫరోఖ్ ఇంజనీర్ (36 ఏళ్ల 138 రోజులు) తర్వాత ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన రెండవ పెద్ద వయసు భారతీయుడిగా రికార్డు సాధించాడు. 

35

అధిక వ‌య‌స్సులో భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన టాప్-5 ప్లేయ‌ర్లు 

1. ఫరూఖ్ ఇంజనీర్ – 36 సంవత్సరాలు, 138 రోజులు (1974, vs ఇంగ్లాండ్)
2. వరుణ్ చక్రవర్తి – 33 సంవత్సరాలు, 164 రోజులు (2024, ఇంగ్లాండ్ vs)
3. అజిత్ వాడేకర్ – 33 సంవత్సరాల 108 రోజులు (1974, vs ఇంగ్లాండ్)
4. దిలీప్ దోషి – 32 సంవత్సరాలు, 350 రోజులు (1980, vs ఆస్ట్రేలియా)
5. సయ్యద్ అబిద్ అలీ – 32 సంవత్సరాలు, 307 రోజులు (1974, vs ఇంగ్లాండ్)

45
Rohit Sharma

Rohit Sharma

ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ట్టులోకి వ‌స్తాడా?

ఛాంపియన్స్ ట్రోఫీకి కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వ‌రుణ్ చక్రవర్తి వ‌న్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్, దుబాయ్ వేదిక‌లుగా జ‌రిగే ఈ ఐసీసీ మెగా టోర్నీకి ముందు భారత్‌కు ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే ఉంది. ప్రస్తుతానికి, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో లేడు. కానీ, క‌ట‌క్ మ్యాచ్ తో పాటు రాబోయే మూడో మ్యాచ్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తే జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. 

55
india, Varun Chakravarthy

india, Varun Chakravarthy

రోహిత్ శ‌ర్మ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి గురించి ఏం చెప్పారంటే? 

సిరీస్ ప్రారంభానికి ముందు చివరి క్షణంలో వ‌రుణ్‌ చక్రవర్తిని వన్డే జట్టులోకి తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారతదేశం నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ విభాగంలో ఉన్నవారికి భిన్నంగా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని గ్రౌండ్ లోకి దించ‌డం గురించి మాట్లాడుతూ.. "అత‌ను ఖ‌చ్చితంగా భిన్న‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. అద్భ‌తుమైన బౌలింగ్ తో టీ20 సిరీస్ లో అద‌ర‌గొట్టాడు. అందుకే అతనితో ఏమి చేయగలమో చూడాలనుకున్నాము" అని రోహిత్ నాగ్‌పూర్‌లో అన్నారు. 

ఈ సిరీస్ సమయంలో అతన్ని ఏదో ఒక దశలో ఆడించడానికి, అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని అందిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అత‌ను అవసరమైనది చేస్తే, ఖచ్చితంగా ఆలోచిస్తామ‌ని ఇంత‌కు ముందు కూడా చెప్పాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA : వరల్డ్ కప్ వేళ భారత్‌కు షాక్ మీద షాక్.. గాయంతో స్టార్ పేసర్ అవుట్
Recommended image2
అభిషేక్ శర్మ డకౌట్స్ వెనక అక్క కోమల్..? ఇదేం దిక్కుమాలిన లాజిక్ రా సామీ..!
Recommended image3
IND vs SA : మరో ఫైనల్ రేంజ్ ఫైట్.. రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved