వ్యభిచారం కూల్ ప్రొఫెషన్.. కమెడియన్ విదూషి సంచలన వ్యాఖ్యలు, నెటిజన్లు ఏమంటున్నారంటే..?
ప్రముఖ స్టాండప్ కమెడియన్.. విదూషి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామెడీలో భాగంగా.. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం మంటలు రేపుతున్నాయి. నెట్టింట సంచలనంగా మారాయి.
స్టాండప్ కమెడియన్ బాగా ఫేమస్ అయ్యారు. విదూషి స్వరూప్. ఆమె తన ప్రోగ్రామ్స్ ద్వారా కడుపుబ్బా నవ్విస్తుంటారు.అయితే తెలిసి అన్నారో.. లేక కామెడీలో భాగంగా అలా సరదాగా అన్నారో తెలియదు కాని.. మహిళలనుకించపరిచే విధంగాకొన్ని వాఖ్యలు చేశారు విదూషి. తన వ్యాఖ్యలతో వివాదం కొనితెచ్చుకున్నారు. వ్యభిచారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కారణాలు ఏమైనా కాని.. చాలా మంది వ్యభిచార మురికి కూపంలో మగ్గుతున్నారు. అందులో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు కూడా పడుతున్నారు. కాని వ్యభిచారం గురించి మాట్లాడుతూ.. అది ఒక కూల్ ప్రొఫెషన్ చాలా ప్రశాంతమైన వృత్తి గా ఆమె పేర్కొన్నారు. అయితే ఇది వివాదం అవుతుందని ఆమె అనుకోలేదనుకుంటా.. అందుకే ఆమె ఇతర వృత్తుల కంటే ఇది ఎంత భిన్నమో ఆమె చెప్పే ప్రయత్నం చేశారు.
కాని ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో మంటలో రగిల్చాయి. ఇంటర్నెట్ లో ఆమెపై విమర్శల దాండి మొదలయ్యింది. అయిలే అందులో కంంత మంది ఆమెను వ్యాతిరేకిస్తున్నా..? విదూషిని సపోర్ట్ చేస్తున్నవారు కూడా లేకపోలేదు. ఏ మాత్రం స్పృహ లేకుండా చేసిన వ్యాఖ్యలుగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. మహిళలను ఎప్పుడూ గౌరవించండి. మహిళల గురించి ఇలా చెప్పడం సరికాదు. సిగ్గు పడాల్సిన చర్య’’ అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.
అదే సమయంలో విదూషి స్వరూప్ కునెట్టింట మద్దతు కూడా లభిస్తోంది. హాస్యం ఉద్దేశ్యం సమాజాన్ని అద్దంలో చూపించడమే. మమ్మల్ని షాక్ కు గురిచేసేలా, నవ్వించేలా చేశారు అని ఓ యూజర్ పేర్కొన్నారు. సమాజంలోని అంశాలను హాస్యంతో తెలియజెప్పడం అనేది కొందరే చేయగలరంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. ఇలా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి.