శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం

By telugu teamFirst Published Apr 6, 2021, 12:07 PM IST
Highlights

తెలుగువారి సంవత్సరాది ఉగాది రాబోతోంది. ఈ సందర్బంగా వచ్చే తెలుగు సంవత్సరం శ్రీప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08,  రాజపూజ్యం - 07 అవమానం - 03.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచించుచున్నది. 

వృషభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా బాధించును. జీవితంలో అనుభవిస్తున్న యోగం చెడిపోవును. చేజేతులారా తప్పులు చేసి నష్టాలు ఏర్పరచు కొందురు. ఏ ప్రయత్నం కూడా మానసికంగా సంతృప్తిని కలుగ చేయదు. నూతన భారీ పెట్టుబడులు 19 -నవంబర్-2021 వరకు పెట్టకుండా ఉండటం మంచిది. 20 నవంబర్ 2021 నుంచి వృషభ రాశి వారికి గురు గ్రహం యోగించును. ముఖ్యంగా వ్రుత్తి విద్యా కోర్సులు చదివిన వారికి అతి చక్కటి ఉద్యోగ అవకాశములు, స్వయం ఉపాధి చేయు వారికి విశేష ధనార్జన ఏర్పరచును. విద్యార్థులకు విశేష లాభ పూరిత సమయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీర్ధ యాత్రలు 20 నవంబర్ 2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు. ఆచార వంతమైన జీవితం ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు. 

శని గ్రహం గడిచిన శార్వరి నామ సంవత్సరం వలెనే  మంచి ఫలితాలను కలుగచేయును. నూతన వాహన కోరిక నెరవేరును. వారసత్వ సంపద లభించును. పనిచేస్తున్న రంగములలో మిక్కిలి పేరు ప్రతిష్టలు పొందగలరు. వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభించును. ఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రం లేదా ఉచ్చ స్థితి లేదా మూల త్రికోణములో ఉన్న వారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు. ఇటువంటి జాతకులు తమ వంశానికి పేరు ప్రఖ్యాతలు వచ్చు సత్కార్యములు చేయుదురు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో  వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువుల వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పరచును. కోరుకున్న విధంగా స్థాన చలనం ఏర్పరచును. పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగును. అయితే శారీరక అనారోగ్యం, వైవాహిక జీవనంలో తీవ్ర గొడవలు, వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఏర్పరచును.  

* గోచార గ్రహస్థితి వలన అనేక బరువుభాద్యతలు మోయవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. సర్పదోషాలు, గ్రహాల దోషాలు ఉన్నవారు నివారణ చేసుకోండి. వివాహయోగం ఉంది. ఆర్ధిక పురోగాభివ్రుద్ది బాగుంటుంది. విదేశాలలో చదువుకునే అవకాశం లబిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోకుండా, వ్యసనాలకు బానిసై ఇంట్లో అశాంతి సృష్టిస్తున్న జీవిత భాగస్వామి మిద విసుగు పుడుతుంది, ఇది వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కుడుతపడుతుంది. ముఖ్యమైన విషయాలలో పెద్దల మాట వినడం శ్రేయష్కరం. 

Also Read: 

click me!