శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం

By telugu teamFirst Published Apr 6, 2021, 11:53 AM IST
Highlights

తెలుగు నూతన సంవత్సరం రాబోతోంది. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీప్లవ నామ సంవత్సరంలో మేషరాశి జాతకం ఎలా ఉందో చూడండి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
 
గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 14 , రాజపూజ్యం - 04 అవమానం - 03.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీ ప్రమేయం లేకుండానే అపవాదులు, అవమానములను పొందడాన్ని సూచించుచున్నది.

13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు, గురు గ్రహం 19-నవంబర్-2021 వరకు వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా పితృవర్గం లోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పరచును. వారసత్వ సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు. కుటుంబంలో తరచుగా శుభకార్య సంబంధ వ్యయం అధికంగా ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రం లో ఉన్న వారు ఒక పర్యాయం 16 రోజుల గురు గ్రహ శాంతి జపము జరిపించు కొనుట మంచిది. 20 - నవంబర్ -2021 నుంచి మేష రాశి వారికి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించుట ప్రారంభం అగును. మిక్కిలి న్యాయమైన ధన సంపాదన ఏర్పరచును. జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. శని మేషరాశి వారికి ఆశించిన విధంగా ధన సంపాదన లభింప చేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యముల, లోహముల వ్యాపారం చేసే వారికి మంచి లాభములు లభింపచేయును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించి సంతాన సౌఖ్యం  కలుగచేయును. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

రాహు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. గడిచిన శ్రీ శార్వరి నామ సంవత్సరం వలెనే ఈ ప్లవనామ సంవత్సరంలో కూడా పేర్కొనదగిన తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏమియూ రాహు గ్రహం వలన మేషరాశి వారికి  లేవు.

కేతు గ్రహం వలన గడిచిన శార్వరి నామ సంవత్సరం వలననే అనేక సమస్యలు ఏర్పడును. శారీరక సౌఖ్యం తక్కువ అగును. ప్రతి కార్యానికి తీవ్రంగా శ్రమించ వలెను. వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు కలిగిన వారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు. నూతనంగా దైవ ఉపాసన చేయదలచిన వారికి అనేక విఘ్నములు ఏర్పడును.

* ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది. ప్రేమ వ్యవహారం పట్ల నమ్మకం పోతుంది. అవివాహితులకు వివాహయోగం కల్గుతుంది. సంతానప్రాప్తి. ఆత్మీయులతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆవకాశవాదులు దరిచేరుతారు జాగ్రత్తలు  వహించవలెను. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహన, గృహ యోగం.రాజకీయ రంగాలవారికి పదవియోగం. స్త్రీలతో విరోధం. అంతర్గత రాజకీయాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యాలు మూడు వంతులు పూర్తిచేస్తారు.

Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ వారి జాతకం

click me!