బెంగాల్‌ ఎన్నికలు : 30 మందితో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా.. జీ23కి మొండి చేయి

By Siva KodatiFirst Published Mar 12, 2021, 5:37 PM IST
Highlights

అసమ్మతి నేతలకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బెంగాల్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జీ 23 నేతలకు అవకాశం దక్కలేదు. 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది.

అసమ్మతి నేతలకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బెంగాల్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జీ 23 నేతలకు అవకాశం దక్కలేదు. 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది.

అయితే ఈ జాబితాలో జీ 23కి చెందిన ఏ ఒక్క లీడర్ కూడా లేరు. గ్రూప్ 23 పేరుతో కొందరు సీనియర్లు.. అధిష్టానం వైఖరికి భిన్నంగా వెళ్తున్నారు. సోనియాతో పాటు రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం కోరితే ప్రచారానికి సిద్ధమని గులాంనబీ ఆజాద్ చెప్పినా.. ఆయనను దూరం పెట్టింది హస్తం పార్టీ. ఇక స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలు ఉన్నారు.

వీరితో పాటు జాబితాలో ఇంకా పార్టీ నేతలు సచిన్‌ పైలట్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, అభిజిత్‌ ముఖర్జీ, మహ్మద్‌ అజారుద్దీన్‌. అశోక్‌ గహ్లోత్‌, మల్లిఖార్జున్‌ ఖర్గే, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, అధీర్‌ రంజన్‌ చౌధరి, కమల్‌ నాథ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, ఆర్పీఎన్‌ సింగ్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, సుర్జీవాలా, జితిన్‌ ప్రసాద, దీపా దాస్‌మున్షీ, అభిజిత్‌ ముఖర్జీ, దీపేంద్ర హుడా, అఖిలేష్‌ సింగ్‌, రామేశ్వర్‌ ఓరన్‌, పవన్‌ ఖేరా, బీపీ సింగ్‌ల పేర్లున్నాయి.

అయితే ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సబాల్‌తో పాటు 23 మందికి అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్- వామపక్షాలతో కలిసి బెంగాల్ ఎన్నికల బరిలో నిలిచింది. 
 

click me!