వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

By narsimha lode  |  First Published Jan 5, 2020, 11:31 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ మంత్రుల పదవులకు ఎసరు తెచ్చి పెట్టాయి. 



హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రి పదవులను కోల్పోతారని సీఎం కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు.

కాంగ్రెస్, బీజేపీలు కూడ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. కేటీఆర్ భావి సీఎం అంటూ టీఆర్ఎస్‌ నేతలు చర్చించడం మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడేక్కించింది. టీఆర్ఎస్‌ లో చోటు చేసుకొంటున్న పరిణామాలను రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

Latest Videos

మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది ఇందులో భాగంగానే గత ఏడాది చివర్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు.

ఈ నెల 4వ తేదీన తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మున్సిపల్ ఎన్నికల్లో  ఓటమి పాలైతే ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు తమ మంత్రి పదవులను కోల్పోతారని కేసీఆర్ హెచ్చరించారు.పార్టీ నేతల మధ్య,  పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య  సమన్వయంతో పనిచేయాలని కేసీఆర్ సూచించారు.

టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి మంత్రి మల్లారెడ్డి మధ్య నెలకొన్న సమన్వయలోపం గురించి చర్చించారు. సమావేశం నుండి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బిజెపిలు కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొన్నాయి.. రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపాలని చూస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చూపాలని భావిస్తుంది.ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో  మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెలుచుకోవాలని  కమలదళంభావిస్తోంది.

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఆ మేరకు స్థానిక సంస్థల్లో స్థానాలను కైవసం చేసుకోలేదు కానీ మున్పిపల్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవాలని  ఆ పార్టీ భావిస్తోంది.


భావి సీఎం కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి భావి సీఎం కేటీఆర్ అవుతారని ఆ పార్టీ నేతలు ఇటీవల కాలంలో ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావి సీఎం కేటీఆర్ అంటూ చర్చకు తెరతీశారు. ఈ వ్యాఖ్యలకు మద్దతినిచ్చే రీతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవితలు మాట్లాడారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని ప్రకటించారు.

గత ఏడాది చివర్లో మంత్రివర్గ విస్తరణకు ముందు కూడ కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే చర్చ పార్టీ వర్గాల నుండి వచ్చింది. హైద్రాబాద్ ప్రాంతానికి చెందిన  పార్టీ సమావేశాల్లో పెద్ద ఎత్తున కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది.

also read:weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి

 ఆ తర్వాత కేటీఆర్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్.  ప్రస్తుతం కేటీఆర్  భావి సీఎం అంటూ చేస్తున్న ప్రకటనలు  కూడ వ్యూహత్మకంగా సాగుతున్న ప్రచారంగా కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఈ ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు.వచ్చే పది నుండి 15 ఏళ్ల పాటు  కేసీఆర్ సీఎంగా ఉంటారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తాను సీఎం అనే విషయమై కేటీఆర్ కొట్టిపారేశారు. 

ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్ కొనసాగుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావు ఏం చేస్తారనే చర్చ కూడ లేకపోలేదు. అయితే సీఎం పదవిని కేటీఆర్ కు కేటాయిస్తే కేటీఆర్ మంత్రివర్గంలో పనిచేస్తానని హరీష్ రావు గతంలో ప్రకటించారు. 


మరోసారి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

ఈ ఏడాది జనవరి 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసిన వారు ఎప్పటికీ బాగుపడరని  ఆయన వ్యాఖ్యానించారు. 

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

తాను నమ్మినవారే తనను మోసం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజలు ఏనాడు కూడ ధర్మం తప్పరని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజలు ధర్మం తప్పితే తాను ఓటమి పాలయ్యేవాడినని ఈటల రాజేందర్ చెప్పారు. గత ఏడాదిలో కూడ మంత్రి ఈటల రాజేందర్ కూడ ఇదే రకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీకి తాము ఓనర్లమన్నారు.

మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్‌ను తొలగిస్తారనే ప్రచారం సాగిన సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో టీఆర్ఎస్‌లో సంచలనం కల్గించాయి.  

Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

మంత్రి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడ మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గంగుల కమలాకర్, కేటీఆర్‌లకు కేసీఆర్ అవకాశం కల్పించారు.  ఈ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.

click me!