వీక్లీ క్రైమ్ రౌండప్: హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి విచారణ.. సీరియల్ కిల్లర్ అరెస్ట్, మరిన్ని

By sivanagaprasad Kodati  |  First Published Dec 29, 2019, 4:04 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని 16 మందిని చంపి అనంతరం నగదు, నగలు దోచుకుంటున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నేరవార్తలు మీకోసం.


 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని 16 మందిని చంపి అనంతరం నగదు, నగలు దోచుకుంటున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నేరవార్తలు మీకోసం.

నాపై తప్పుడు కేసులు పెట్టారు: హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి

Latest Videos

హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణను కొనసాగిస్తోంది. గురువారం అతనిని నల్గొండలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు, ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించారు.

Also Read:నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

కాగా ఈ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. గ్రామంలోని కొందరితో తమ కుటుంబానికి భూతగాదాలు ఉన్నాయని.. వీటి వల్లే వారు తనపై ఫిర్యాదు చేశారని అతను అంటున్నాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. కేసు విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు.

16 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్:

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఒంటిపై ఉన్న బంగారం, నగల కోసం 16 మందిని దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవాబుపేట మండలం కూచురు గ్రామానికి చెందిన ఆలివేలమ్మ అనే 53 ఏళ్ల మహిళ శవాన్ని ఈ నెల 17న పోలీసులు గుర్తించారు.

Also Read:సీరియల్ కిల్లర్: మత్తులోకి దించి 16 మంది మహిళలను చంపాడు

అయితే ఆమె హత్యకు గురైనట్లు క్లూస్ టీమ్ పోలీసులకు చెప్పడంతో ఇందులో ఎరుకల శ్రీను అనే వ్యక్తి హస్తముందని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తాను నేరాన్ని చేసినట్లు శ్రీను అంగీకరించాడు. ఇతను 2018 నుంచి షాద్‌నగర్, శంషాబాద్, మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పరిధిలో మొత్తం 17 మంది మహిళలను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య, జీవితఖైదు:

ప్రియుడిపై మోజుతో ఓ మహిళ భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో న్యాయస్థానం వివాహితకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధించింది. రసూల్‌పురాకు చెందిన కుమార్, పద్మా భార్యభర్తలు ఈ క్రమంలో లక్ష్మణ్ అనే వ్యక్తితో పద్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

Also Read:ప్రియుడిపై మోజు... భర్త దారుణ హత్య.. కోర్టు జీవిత ఖైదు

దీని గురించి తెలుసుకున్న కుమార్.. లక్ష్మణ్‌ను హెచ్చరించాడు. దీనిపై కక్ష పెంచుకున్న పద్మ, లక్ష్మణ్‌లు 2013 సెప్టెంబర్ 22న కుమార్‌కు ఉరివేసి హత్య చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ఆరో మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి.. నిందితులిద్దరికి జీవితఖైదుతో పాటు చెరో 5 వేల జరిమానా విధించింది. 

బావమరిదిని చంపిన బావ:

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లికి చెందిన పాపన్నగారి శేఖర్  మృతదేహాం మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని బావిలో దొరికింది. శేఖర్ ను అతడి బావ పోతుల శేఖర్ ఆయన స్నేహితుడు బిక్షపతి గురువారం నాడు హత్య చేశారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా రామయంపేట శివారులోని బావిలో వేశాడు.

మృతదేహం విషయం వెలుగు చూడడంతో  నిందితుడు పోతుల శేఖర్ పోలీసులకు లొంగిపోయాడు.  ఈ విషయం తెలిసిన పాపన్నగారి శేఖర్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఉదయం  పోతుల శేఖర్ రెండు ఇళ్లను ధ్వంసం చేశారు. అంతేకాదుశేఖర్ కు సహకరించిన భిక్షపతి ఇంటిపై కూడ మృతుడి గ్రామస్తులు దాడి చేశారు.

Also Read:బావమరిదిని చంపిన బావ, నిందితుల ఇళ్లు ధ్వంసం, ఉద్రిక్తత

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భఆరీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై గ్రామస్తులు బైఠాయించడం వల్ల  ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. 
 

click me!