క్రైమ్ రౌండప్: తల్లిని చంపిన కీర్తి జైలుకి.. భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, మరిన్ని

By sivanagaprasad Kodati  |  First Published Nov 3, 2019, 4:03 PM IST

అక్రమ సంబంధానికి అడ్డొస్తొందని కన్నతల్లిని చంపిన కీర్తి కేసులో తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత జరిగినా ఆమె మొదటి ప్రియుడు బాల్‌రెడ్డిని పెళ్లి చేసుకుంటానంటోంది. ఇక మరో మహిళతో సంబంధం పెట్టుకుని వేధింపులకు గురిచేయడంతో అంబర్‌పేట‌లో టెక్కీ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి నేరవార్తలు మరిన్ని మీకోసం.


భర్తతో విభేదాలు.. అత్తపై పగ: మెట్టినింటికి కన్నం వేసిన కోడలు

సికింద్రాబాద్ సమీపంలోని బోయిన్‌పల్లిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అత్తపై పగ తీర్చుకోవడానికి మెట్టింట్లోనే దొంగతనం చేసిన కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన కొల్లూరి శ్రీనివాస్ తన కుమార్తె సుప్రియను పాత బోయిన్‌పల్లి మల్లిఖార్జున‌నగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి సరళ కుమారుడు ధీరజ్‌తో నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు.

Latest Videos

పెళ్లయిన కొద్దిరోజులకే సుప్రియ, ధీరజ్‌ల మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇక తన జీవితం ఇక బాగుపడదని భావించిన సుప్రియ ధీరజ్ విషయంపై అత్తను ప్రశ్నించి పుట్టింటికి వెళ్లిపోయింది. దసరా పండుగకు మెట్టినింటికి వచ్చిన సుప్రియ ధీరజ్ విషయంపై అత్తను మరోసారి ప్రశ్నించినా ఆమె బదులివ్వలేదు. దీంతో సుప్రియ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చేసింది.

Also Read:నిండు గర్భిణి... ఇద్దరు ప్రియులతో కలిసి... భర్తను అతి కిరాతకంగా....

వచ్చేటప్పుడు ఇంటి తాళాలను తీసుకొచ్చింది. అత్తపై ప్రతీకారం తీర్చుకుంటానని, సహకరించాలని సోదరుడు, తల్లిదండ్రులను కోరింది. కూతురి ఆనందం కోసం వారు అంగీకరించారు. ఇందుకోసం అత్తింటికి కన్నం వేయాలని భావించి నకిలీ తాళం చెవిని సృష్టించింది. ప్లాన్‌లో భాగంగా ఈ నెల 21న హైదరాబాద్ వచ్చింది. సరళ ఇంటి పరిసరాల్్లో మాటువేసి.. ఆమె బయటకి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులు, సోదరుడు సాత్విక్ సాయంతో నకిలీ తాళం చెవితో లోపలికి ప్రవేశించింది.

బంగారు ఆభరణాలు, వెండిని సంచిలో వేసుకుని.. దీనిని దొంగతనంగా చిత్రీకరించేందుకు గాను దుస్తులను చిందరవందర చేశారు. పడకగది తలుపు తెరిచి.. బయటకు వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర ద్వారానికి గడియ పెట్టకుండా వదిలేసి పరారయ్యారు. బయట పనిముగించుకుని ఇంటికి వచ్చిన సరళ బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆస్తి కోసమే కీర్తితో శశి ప్రేమాయణం, తల్లిపై ద్వేషం పెంచి... హత్యకు కుట్ర

హైదరాబాద్ హయత్‌నగర్‌లో తల్లిని చంపిన కీర్తి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తల్లిని చంపేలా కీర్తిని ప్రోత్సహించింది ఆమె ప్రియుడేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఆస్తి కోసమే ఆమె ప్రియుడు శశి... కీర్తిని ప్రేమించాడని తమ ప్రేమకు ఆమె తల్లి రజిత అడ్డుగా ఉందని అతను కక్ష కట్టాడు. ఇదే క్రమంలో తల్లిపై కీర్తికి లేనిపోని విషయాలను నూరిపోసి ద్వేషం ఏర్పడేలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది కీర్తి. 

Also Read:తల్లిని చంపిన కీర్తి: చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక నిఘా

కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్వహారం నడిపిస్తున్న విషయాన్ని తల్లి రజిత (38) గుర్తించింది. కూతురు కీర్తిని తల్లి రజిత మందలించింది. దాంతో కక్ష పెంచుకుని ప్రియుడితో కలిసి హతమార్చింది. తండ్రి లారీ డ్రైవర్ గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి కీర్తి ఇంట్లో మూడు రోజుల పాటు గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. 

తాను విశాఖపట్నం పర్యటనకు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో కీర్తి గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

తిరుమలలో రెచ్చిపోతున్న దళారీలు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది. అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డుకాలం మొదలైంది. క్యూలైన్ల వద్ద అనుమానం కలిగిన టిక్కెట్లను తనిఖీలు చేయడం ప్రారంభించడంతో దళారుల బాగోతం బయటపడుతోంది.

గత రెండు నెలల కాలంలో మొత్తం 300 మంది దళారులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న దళారి చారి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 46 మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై కొందరు దర్శనాలు పొందినట్లుగా అధికారులు గుర్తించారు.

Also Read:తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫారసు లేఖపై 36 సార్లు టిక్కెట్లు పొందగా.. అంబర్‌పేట ఎమ్మెల్యే సిఫారసుపై 23, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు పొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ, ప్రస్తుత హోంమంత్రులను సైతం దళారులు వదిలిపెట్టలేదు. ఒక్క దళారే వందల సార్లు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయించాడు. అలాగే ఇంటిదొంగ గుట్టును కూడా విజిలెన్స్ రట్టుచేసింది. టీటీడీలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ సులభ దర్శనాలు చేయిస్తానని భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. 

మరో మహిళతో ఎఫైర్: చచ్చిపోమంటూ వేధింపులు, భార్య ఆత్మహత్య

హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే... అంబర్‌పేటకు చెందిన వ్యాపారి మురళి కుమారుడు సుకీత్ ఐదేళ్ల క్రితం కార్వాన్ ప్రాంతానికి చెందిన శివానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరం తెలపలేదు.

Also read:మెదక్ లో కలకలం... మహిళను ముక్కలు ముక్కలుగా నరికి..

వివాహం తర్వాత కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న సుకీత్ తన భార్యను నిర్లక్ష్యం చేశాడు. వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న శివానీ భర్తను ప్రశ్నించడంతో అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆరు నెలలుగా వేధింపులు మరింత తీవ్రమవ్వడంతో శుక్రవారం రాత్రి శివానీ అంబర్‌పేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 

click me!