కట్టెల పొయ్యిలో పడేసి భర్తను చంపిన భార్య

By telugu team  |  First Published Jan 5, 2020, 9:33 AM IST

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ఓ మహిళ తన భర్తను కట్టెల పొయ్యిలో పడేసి చంపింది. తరుచుగా భర్తతో గొడవ పడుతూ వస్తున్న ఆ మహిళ చివరికి ఈ దారుణానికి పాల్పడింది. ఆమె పరారీలో ఉంది.


వరంగల్: ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లిలో జరిగింది. భర్తను మహిళ కట్టెల పొయ్యిలో పడేసి హత్య చేసింది.

కాట్రపల్లికి చెందిన రేణికుంట్ల రవి (44)కి కొప్పుల గ్రామానికి చెందిన రజితతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రజిత భర్తతో తరుచుగా గొడవ పడుతూ వచ్ిచ చివరకి వరంగల్ వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకుంటూ వస్తోంది.

Latest Videos

శుక్రవారం కాట్రపల్లికి వచ్చిన రజిత మద్యం తాగి ఉన్న రవితో గొడవ పడింది. రాత్రి 9 గంటల తర్వాత పెద్దగా కేకలు వినిపించడంతో పక్కన ఉంటున్న రవి అక్క సుగుణ వారి ఇంటికి వెళ్లి చూసింది. 

రవి కట్టెల పొయ్యిలో పడి కాలుతున్న దృశ్యం ఆమెకు కనిపించింది. అప్పటికే ముఖం కాలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రవి మృతి చెందాడు. రజిత పరారీలో ఉంది.

click me!