కరోనా అనుమానితుల జంట: కాజీపేటలో ఆగిపోయిన నిజాముద్దీన్

By telugu teamFirst Published Mar 21, 2020, 1:37 PM IST
Highlights

వరంగల్ జిల్లా కాజీపేట వద్ద నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును ఆపేశారు. ఓ జంటకు కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో రైలును ఆపేసి ఆ జంటను వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

వరంగల్: వరంగల్ జిల్లాలో కరోనా అనుమానితుల జంట బయటపడింది. నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న జంటకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. దాంతో కాజీపేటలో నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ను ఆపేశారు. 

నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైల్లోని ప్రయాణికులు, రైల్వే అధికారులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. వారిద్దరిని వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలో మథిర వద్ద కృష్ణా ఎక్స్ ప్రెస్ ఐదో బోగీలో ప్రయాణిస్తున్నవారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. దాంతో రైలును ఆపేసి శానిటైజ్ చేసి తర్వాత కదిలించారు.

 తెలంగాణలో తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. లండన్ నుంచి వచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ఆ సంఖ్య 19కి చేరింది. ఇండోనేషియా నుంచి వచ్చి 10 మందిలో 8 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. 

ఈ నెల 17వ తేదీన లండన్ నుంచి హైదరాబాదు వచ్చిన 18 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇండోనేషియన్లతో కలిసి మత ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ బృందం రామగుండం నుంచి ఆటోలో కరీంనగర్ వచ్చారు. ఆటో డ్రైవర్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. 

లండన్ నుంచి వచ్చిన యువతిని ఈ నెల 18వవ తేదీన హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఐసోలేషన్ లో పెట్టారు. అయితే, ఆ తర్వాత ఇండోనేషియన్లను, ఆ యువతిని చెస్ట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు 

ఇండోనేషియా బృందాన్ని కలిసిన 25 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. ఇప్పటి వరకు 351 మంది వ్యక్తుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. వారందరికీ నెగెటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ ఉన్నవారితో సన్నిహితంగా మెలిగిన చాలా మంది రక్తపరీక్షలకు వస్తుండడంతో ఆస్పత్రుల వద్ద జనసందోహం చోటు చేసుకుంది. 

గాంధీ ఆస్పత్రికి శుక్రవారంనాడు 243 మంది అనుమానితులు వచ్చారు. వారి రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. వారిలో 20 మందిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. చెస్ట్ ఆస్పత్రిలో శుక్రవారంనాడు 23 మందికి పరీక్షలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని క్వారంటైన్ కేంద్రంలో 110 మందికి పరీక్షలు నిర్వహించారు. ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలగడంతో గాంధీ ఆస్పత్రికి పంపించారు. 

click me!