వరంగల్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో పేలుళ్ల కలకలం: ముగ్గురు మహిళలకు గాయాలు

By Nagaraju penumala  |  First Published Sep 26, 2019, 1:31 PM IST

ఒక్కసారిగా కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిలో స్వరూప, ప్రియ, లక్ష్మీ అనే ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. 


వరంగల్: వరంగల్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. వజ్ర మాట్రిక్స్ కంపెనీలో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

రాంపూర్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో వజ్ర మాట్రిక్స్ కంపెనీ ఉంది. ఇది గ్రానైట్స్ కు సంబంధించి పాలిష్ బ్రిక్స్ ను ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఈ కంపెనీలో తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

Latest Videos

గురువారం ఏడుగురు కార్మికులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిలో స్వరూప, ప్రియ, లక్ష్మీ అనే ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా కాలిపోయారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో హాహా కారాలు చేస్తోంది ఆ మహిళ. మరోవైపు ప్రియ అనే యువతి కాలు విరిగిపోగా కన్ను సైతం తీవ్ర గాయాలపాలయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.   

 

click me!