వరంగల్ జిల్లాలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ కోర్టు శుక్రవారం నాడు తీర్పు చెప్పింది.
వరంగల్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన శివ అనే నిందితుడుకు జీవిత ఖైధును విధిస్తూ వరంగల్ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం నాడు తీర్పు చెప్పారు.
2017 డిసెంబర్ మాసంలో ఆరేళ్ల చిన్నారిపై శివ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూలై 1న ప్రారంభమైన విచారణ ప్రారంభమైంది. ఈ నెల 12న వాదనలు పూర్తయ్యాయి..నేరం రుజువైనట్టుగా జడ్జి ప్రకటించారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసినందుకు గాను నిందితుడు శివకు జీవిత ఖైదును విధిస్తూ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం నాడు తీర్పు వెల్లడించారు.
గతంలో కూడ ఇదే జిల్లాలో నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కూడ కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో కూడ విచారణను పూర్తి చేసి నిందితుడికి శిక్ష విధించింది కోర్టు. ఇదే కేసు తరహలోనే ఈ కేసు విచారణను త్వరగానే పూర్తి చేశారు.