ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో పాటు ఉత్తరాంధ్రకు మరో ప్రమాదం పొంచివుంది. కాబట్టి అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఏపి వుండాలని విపత్తు నివారణ విభాగం హెచ్చరించింది.
అమరావతి: ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మెళ్లగా భారత్ లోనూ విజృంభిస్తోంది. దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు ఇరు తెలుగురాష్ట్రాలు కూడా ముందుగానే అప్రమత్తమయ్యాయి. ఇది చాలదన్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ను మరో ప్రమాదం వెంటాడుతోంది.
ఏపిలోని పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశాలున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పిడుగుపాటు ప్రమాదం పొంచివుందని హెచ్చరించారు.
undefined
ముఖ్యంగా విశాఖ జిల్లాలోని పద్మనాభం, విజయనగరం జిల్లాలోని చీపురపల్లి నెల్లిమర్ల, గరివిడి, డెంకాడ, పూసపాటిరేగ, గుర్ల, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని...సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.