తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారికి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా లైదాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని... వారి తొక్కలు ఊడిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు.
గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో కోట్ల అవినీతి జరిగిందని... దీనిపై అతి త్వరలో విజిలెన్స్ రిపోర్టు వస్తుందన్నారు. అవినీతికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పీకర్ హెచ్చరించారు.
undefined
read more వైసిపి ఎంపీ నందిగం సురేశ్ కు సిగ్గుందా...: వంగలపూడి అనిత ఫైర్
ఇక తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిపై తమ్మినేని సీరియస్ అయ్యారు. ఊరకుక్కులు మొరుగుతూ ఉంటాయి... వాటిని పట్టించుకోబోనని అన్నారు. భారీ బహిరంగసభ పెట్టి ఒక్కొక్కరికీ బ్యాండ్ బాజా వాయిస్తాని అన్నారు. ఎవ్వరీని వదలిపెట్టబోనని అన్నారు.
ప్రజలకు ముందు సేవ చేసిన తర్వాత అలాంటి వారి పనిపడదామని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఇప్పటికయితే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకోవాలని తమ్మినేని సీతారాం సూచించారు.