ఇటీవల టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేపట్టిన విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ా తాజాగా మాజీ మంత్రి సబ్బం హరి సీరియస్ గా స్పందించారు.
విశాఖపట్నం: ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టడానికి పూనుకున్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడిని విశాఖలో రాజకీయ పైత్యంతోనే అడ్డుకున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలను ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయ రాక్షస క్రీడలో భాగంగానే ఈ అడ్డగింతకు పాల్పడ్డారని టీడీపీ సీనియర్ నాయకుడు హరి మండిపడ్డారు.
ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో పార్టీలకు చెందినవారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారని, ఈ తరహా పైత్యంతో కూడిన రౌడీ రాజకీయాలు చేయడాన్ని తాను చూడలేదన్నారు. బయటినుంచి మందు, చికెన్ బిర్యానీ, రూ.500 ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులతోనే చంద్రబాబుపై దాడులు చేయించారని ధ్వజమెత్తారు.
undefined
జగన్ సీఎం అయినప్పటికీ చంద్రబాబే వారి కళ్ల ముందు కదలాడుతున్నారని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన్ను లేకుండా చేయాలని వైసీపీ నాయకత్వం భావిస్తోందని ఆరోపించారు.
‘డీసీపీ, ఏసీపీ, సీఐ ర్యాంకుల్లో ఉన్న పోలీసులను వైసీపీ ప్రభుత్వం గూండాలుగా వాడుకుంది. ఎంతోమంది పోలీసులు గురువారం విమానాశ్రయంలో నేమ్ ప్లేట్‌లు లేకుండా కనిపించారు. వారంతా పోలీసులేనా? బయటి నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో అల్లకల్లోలం సృష్టించాలని చూశారా..? అనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉంది. పోలీసుల ప్లాన్ ప్రకారం, వారి కన్నుసన్నల్లో ఇదంతా జరిగింది. రాజధాని ప్రాంతంలో రోజాను అడ్డుకున్నందుకు రైతులను అరెస్టు చేసిన పోలీసులు చంద్రబాబును అడ్డుకునేందుకు బీభత్సం సృష్టించినా ఒక్కరినీ అరెస్టు చేయకుండా, కేసులు పెట్టకుండా ఎందుకు మిన్నకున్నారో చెప్పాలి. గతంలో చంద్రబాబు ఇలాగే ప్రవర్తించి ఉంటే జగన్ అన్ని వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసేవారా’ అని నిలదీశారు. విశాఖ పోలీసులకు 40 ఏళ్లుగా ఉన్న మంచి పేరును ఈ ఒక్క ఘటనతో చెడగొట్టుకున్నారన్నారు. తాను పర్మిషన్ ఇచ్చినా మాజీ సీఎంను పర్యటనకు ఎందుకు పంపించలేదో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను కమిషనర్ వివరణ అడిగి చర్యలు తీసుకోవాలని, లేకపోతే గూడుపుఠాణీలో ఆయనకూ భాగస్వామ్యం ఉందని భావించాల్సి ఉంటుంది'' అని తెలిపారు.
read more జగన్ క్రూరత్వం, విశాఖ ప్రజలను అవమానిస్తున్నారు: యనమల
‘ఎయిర్‌పోర్టులో ఆందోళనకారులను అడ్డు తొలగించి చంద్రబాబును పంపించాలని పోలీసులు నిజంగా అనుకుంటే జరిగి ఉండేది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో అందుకు ప్రయత్నించలేదు. ఇంత జరిగినా చంద్రబాబు కాల్చేస్తా, నరికేస్తానన్న మాటలు మా ట్లాడలేదు. హుందాగా తిరిగి వెళ్లిపోయార’ని తెలిపారు.
మళ్లీ బాబే వస్తారని..
రాష్ట్రంలో జగన్ పాలన బాగుంటే చంద్రబాబును ఈపాటికే ప్రజలు మరచిపోయి ఉండేవారని.. టీడీపీ నుంచి గెలిచిన పది మందికిపైగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ఉండేవారని సబ్బం అన్నారు. అయితే జగన్ పాలన చూసి మళ్లీ బాబే వస్తారని ప్రజలు, నాయకులు విశ్వసిస్తున్నారని చెప్పారు. ‘హుద్‌హుద్ వంటి విపత్తు వచ్చినప్పుడు చంద్రబాబు వారం రోజులపాటు ఇక్కడే ఉండి ఇబ్బందుల్లేకుండా నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు’ అని అన్నారు.
సెక్రటేరియట్ ఇస్తే చాలా?
విశాఖ ప్రాంతానికి సెక్రటేరియట్‌ను మాత్రమే కేటాయించి రాజధాని ఇస్తున్నామని చెబితే ఎలాగని సబ్బం ప్రశ్నించారు. ఇక్కడ నిరుపేదలకు భూముల పంపిణీ పేరుతో వైసీపీ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని వెల్లడించారు. ‘ల్యాండ్ పూలింగ్ పేరుతో మధురవాడ, పద్మనాభం, ఆనందపురం తదితర మండలాల్లోని ప్రజలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా తీసుకుంటోంది. ఈ ప్రక్రియంతా బయటి నుంచి వచ్చి వ్యక్తుల కనుసన్నల్లోనే జరుగుతోంది. సుమారు ఐదు వేల ఎకరాలు ఈ విధంగా తీసుకున్నారు. చంద్రబాబు ఆయా గ్రామాల్లోకి వెళ్తే బాధితులు పత్రాలతో సహా తెలియజేస్తారన్న భయంతోనే పర్యటనను అడ్డుకున్నారు. విశాఖలో కిరాయి మూకలతో ఆందోళన చేయించినట్లే రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా నిరసనలు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న అనుమానం సబ్బం వ్యక్తం చేశారు.
read more చంద్రబాబుకి పులివెందల ఫోబియా... విజయసాయి రెడ్డి సెటైర్లు
రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..?
‘పోలవరం నిలిచిపోయింది..?రాజధాని ఆగిపోయింది, అభివృద్ధి జరగడం లేదు. రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థంకావడం లేదు’ అని సబ్బం అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంత కావాలని అడిగిందో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా రూ.56 వేల కోట్లు పోలవరం పూర్తి చేయడానికి కావాలని కోరుతోందని.. అప్పుడు చేసిన అవినీతి ఆరోపణలు ఎందుకు నిరూపించలేకపోయారో చెప్పాలన్నారు. రూ.300 కోట్లు వెచ్చించి నిర్మించిన పట్టిసీమలో అవినీతి జరిగిందని, వృథా అని చెప్పిన వైసీపీ నాయకులు.. ఇప్పుడదే కాంట్రాక్టరుకు పోలవరం ప్రాజెక్టును ఎందుకు అప్పగించారో చెప్పాలన్నారు.
‘జగన్ సీఎం అయినప్పటికీ చంద్రబాబే వైసీపీ వారి కళ్ల ముందు కదలాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన్ను లేకుండా చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. బయటినుంచి మందు, చికెన్ బిర్యానీ, రూ.500 ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులతోనే చంద్రబాబుపై దాడులు చేయించారు.ఎంతోమంది పోలీసులు గురువారం విమానాశ్రయంలో నేమ్ ప్లేట్‌లు లేకుండా కనిపించారు. వారంతా పోలీసులేనా? బయటి నుంచి తెచ్చిన వారితో అల్లకల్లోలం సృష్టించాలని చూశారా?’' అని ప్రశ్నించారు.
‘చంద్రబాబు అవినీతిపై పుస్తకం వేశారు. వివేకా హత్య కేసు సీబీఐకి ఇవ్వాలి. కోడికత్తితో తనను హత్య చేసేందుకు యత్నించారని చెప్పిన మాటలన్నీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మర్చిపోయారో జగన్ చెప్పాలి'' అని సబ్బం హరి నిలదీశారు.