అన్న కొడుకంటే అంతులేని ప్రేమ: ఇకలేడని తెలిసి బాబాయి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Feb 28, 2020, 10:03 PM IST
అన్న కొడుకంటే అంతులేని ప్రేమ: ఇకలేడని తెలిసి బాబాయి ఆత్మహత్య

సారాంశం

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన అన్నయ్య కుమారుడు చనిపోయడనే బాధను తట్టుకోలేక బాబాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన అన్నయ్య కుమారుడు చనిపోయడనే బాధను తట్టుకోలేక బాబాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన ఈశ్వరరావు కుమారుడు 12 ఏళ్ల భానుప్రకాశ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

Also Read:కొడుకు కాలేజీకి వెళ్లలేదని... తల్లి ఆత్మహత్య

ఈ నేపథ్యంలో బాలుడిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుప్రకాశ్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి చిన్నాన్న చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

పిల్లాడు మరణించిన కొద్దిసేపటికే ఆసుపత్రి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి వివాహమైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల వల్ల భార్యకు దూరంగా ఉంటున్నాడు.

Also Read:కేరళ సీరియల్ కిల్లర్ సైనేడ్ జాలీ ఆత్మహత్యాయత్నం

చిరంజీవికి సంతానం లేకపోవడంతో భానుప్రకాశ్‌ను ప్రేమగా చూసుకునేవాడు. ఆ మమకారం కారణంగానే బాలుడి హఠాన్మరణం తట్టుకోలేక మృతిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని స్థానికులు చెబుతున్నారు. చిరంజీవి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు