కారణమిదే: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు

By narsimha lodeFirst Published Sep 27, 2019, 11:00 AM IST
Highlights

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


విశాఖపట్టణం: మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు  చేశారు. ఏపీ సీఎం  జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై పోలీసులు కేసు పెట్టారు.

విశాఖపట్టణంలోని త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ లో అయ్యన్నపాత్రుడుపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు  ఆయనపై ఐపీసీ 153ఏ, 500,506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ నేతలపై వైఎస్ఆర్‌సీపీ కేసులు నమోదు చేస్తోందని  టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ కేసుల కారణంగానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడని కూడ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

click me!