అన్నను చంపిన తమ్ముడు: మావోల భయంతో ఇలా... (వీడియో)

Published : Aug 24, 2020, 05:54 PM ISTUpdated : Aug 24, 2020, 06:15 PM IST
అన్నను చంపిన తమ్ముడు: మావోల భయంతో ఇలా... (వీడియో)

సారాంశం

ఆస్తి కోసం ఓ వ్యక్తి తన అన్నయ్యనే పొట్టన పెట్టుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మావోల ప్రభావం వల్ల అటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు.

విశాఖపట్నం: విశాఖపట్నం పాడేరు అటవీ ప్రాంతంలోని పెదబయలు, మండలం మారుమూల కుంతుర్ల పంచాయతీ కుంతుర్ల గ్రామంలో  కుటుంబ కలహాలతో మనస్పర్ధలు ఏర్పడి  అన్నయ్య గుంట రాంబాబు (40)ను గుంట  కృష్ణారావు( 38) నాటు తుపాకీతో ఆదివారం సాయంత్రం5గంటల ప్రాంతంలో  కాల్చి చంపినట్లు విలేకరులకు స్థానికులు తెలిపారు  

మృతుడు రాంబాబును పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి వారి కుటుంబసభ్యుల సహకారంతో తరలిస్తున్నట్లు తెలిపారు. పంచనామా ఆనంతరం మృతిని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామని సెక్రటరీ నాగేశ్వరవు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సంఘటన స్థలానికి పోలీసులు ఎవరు రాలేదు. హత్యచేసిన నిండుతుడు పరారీలో ఉన్నాడు. 

అయితే, గ్రామస్తులు మాత్రం నిందితుడిని ఊరి నుండి పూర్తిగా పంపించేయలని, ఎక్కడున్నా పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. పోలీసులు ఎవ్వరు రాకపోవడంతో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ, గ్రామస్తుల సమక్షంలో శవ పంచనామా  కోసం జీపులో మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

"

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు