
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం డాబా గార్డెన్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
దాంతో మనస్తాపానికి గురైన భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యాయత్నానికి ఓడిగట్టారు. వారిని స్థానికులు కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు కూడా చికిత్స పొందుతున్నారు.
"