ఆ నిర్ణయానికి స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం: స్పీకర్ తమ్మినేని

By Arun Kumar P  |  First Published Dec 27, 2019, 3:17 PM IST

ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నమూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రంలోని అత్యధిక ప్రజానికం ఆమోదిస్తోందని శాసనసభాపతి తమ్మినేని సీతారం తెలిపారు. 


విశాఖపట్నం: రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన మూడు రాజధానులు కాన్సెప్ట్ ను రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించగా అమరావతి ప్రాంతంలోని ప్రజలు, రైతులు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జగన్ నిర్ణయాన్ని టిడిపి నాయకులు తుగ్లక్ నిర్ణయాలతో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటుగా స్పందించారు.  

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారే నిజమైన తుగ్లక్ లని స్పీకర్ విమర్శించారు. రాష్ట్రంలోని అత్యధిక ప్రజానికం సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించారని...  త్వరలో జరగబోయే స్థానిక సంస్థల్లో కానీ భవిష్యత్ లో జరగబోయే అసెంబ్లీ, ఎన్నికల్లో గాని రాజధాని అంశమే రెఫరెండం కాబోతోందన్నారు. 

Latest Videos

read more  ముగిసిన ఏపి కేబినెట్ భేటీ...కీలక నిర్ణయాలివే

ప్రస్తుతం తాను శ్రీకాకుళం రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని... కేవలం రాజధాని కోసమే మాట్లాడతానని స్పీకర్ తెలిపారు.  రాజధాని పేరుతో ఇంతకాలం దోపిడీ చేసి భూములు కొట్టేసినోళ్లే  ఇప్పుడు ప్రజల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పోవద్దని కొందరు విశాఖకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై గతంలోను స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి వెళ్తుంటే ఎడారిలోకి వెళ్తున్నట్లుందని.. అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్‌ ఎడారిలోకి వెళ్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. రాజధాని నాది అని ప్రజలు భావించాలి.. కానీ అమరావతిలో ఆ ఫీలింగ్ కనిపించడం లేదని తమ్మినేని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని.. విమర్శలు చేస్తున్నవారు వాస్తవాలు తెలుసుకోవాలని సీతారాం సూచించారు.

read more  పాపం పండే రోజు వస్తే దాక్కోలేరు: చంద్రబాబుపై నాని వ్యాఖ్యలు

 ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రభుత్వానికి సూచించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి మూడు రాజధానుల ప్రతిపాదన తోడ్పడుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.

 

click me!