ముంబైకి చెందిన ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిజినెస్ జొమాటో డెలివరీ ఏజెంట్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో జోమాటో స్పందించి ఏంచేసిందంటే...
ముంబై : పుట్టినరోజు ఎవ్వరికైనా ప్రత్యేకమైనదే. తమ జీవితంలోని జ్ఞాపకాలు, ప్రేమ, సంతోషం అన్నింటినీ.. తమ ఆత్మీయులతో పంచుకునే రోజు. ప్రియమైన వారికి పార్టీలు ఇవ్వడం సర్వసాధారణం. ఇక చిన్నపిల్లలైతే.. స్కూల్లో చాక్లెట్స్ పంచి, కొత్త బట్టలు వేసుకుని సంబరాలు చేసుకుంటారు. దాన్నే ఫాలో అయ్యాడో అదే ముంబైకి చెందిన ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిజినెస్ జొమాటో డెలివరీ ఏజెంట్.
ఇటీవల తన 30వ పుట్టినరోజున తాను డెలివరీ చేసిన ప్రతి ఆర్డర్‌తో పాటు కస్టమర్‌లకు చాక్లెట్‌లను పంపిణీ చేశాడు. దీన్ని ఎవరో ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. అతని పోస్ట్ వైరల్ అయిన తర్వాత, జొమాటో అతనికి పార్టీని కూడా ఇచ్చింది. ఈ పోస్ట్‌ను ఇంటర్నెట్ 2.0లోని ఇండియన్స్ అనే ఫేస్‌బుక్ పేజీ షేర్ చేసింది.
undefined
ఒరిజినల్ పోస్ట్‌లో, డెలివరీ ఎగ్జిక్యూటివ్ కరణ్ ఆప్టే తన బర్త్ డే సందర్భంగా ఒక కొత్త షర్ట్‌ని కొనుక్కున్నాడు, ఫుడ్ డెలివరీ చేసిన కస్టమర్లందరికీ చాక్లెట్‌లను కూడా.. ప్యాకెట్ కు చుట్టి డెలివరీ చేశారు. క్యాడ్‌బరీ 5 స్టార్ చాక్లెట్ టేప్‌తో ఫుడ్ ప్యాకెట్ ఫొటోను కూడా షేర్ చేశాడు. పోస్ట్ వైరల్ అయ్యింది. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఆప్టే చేసిన పనికి మెచ్చుకున్నారు.
నెటిజన్లు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. జొమాటోను ట్యాగ్ చేశారు. ఇంతమంచి వ్యక్తి మీ డెలివరీ బాయ్ గా ఉన్నాడని పొగిడారు. అతనికి ఏదైనా పార్టీ ఇవ్వాలని జొమాటోను సూచించారు. ఈ అభినందనల వెల్లువను గమనించిన జొమాటో స్పందించింది. ఆ తరువాత ఆప్టే ఇన్‌స్టాగ్రామ్‌లో.. కంపెనీ తనకు కేక్ పంపిందని చెబుతూ.. ఆ కేక్ ఫోటో షేర్ చేశాడు.
ఆ తరువాత మరొక అప్‌డేట్‌ను పోస్ట్ చేశాడు ఆప్లే. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన పుట్టినరోజును జరుపుకుందని.. టీం తనను బోరివలిలో లంచ్ కోసం తీసుకువెళ్లిందని తెలిపాడు. ఆ టీమ్ ఫోటోను షేర్ చేస్తూ.. తన టీమ్ లీడర్, ఏరియా మేనేజర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.