ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఎదుటివారు లేదా మన భాగస్వాములు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం అవుతుంది. ఆ ప్రేమపరీక్షలో ఈ ప్రేమికుడికంటే, దొంగే డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు.
ప్రేమికులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ప్రియుడు ప్రవర్తించిన తీరుపై కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ప్రియురాలి బేలతనంపై సానుభూతి, దొంగ మంచితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రేమజంట చేతిలో చేయి వేసుకొని.. ప్రేమ కబుర్లు చెబుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. ఇంతలో బైక్ మీద వచ్చిన ఇద్దరు.. ప్రియురాలిని బ్యాగ్ ఇవ్వాలంటూ కత్తితో బెదిరించారు. అది చూసిన ప్రియుడు.. ప్రియురాలిని అక్కడే వదిలేసి.. అక్కడి నుంచి ఒకటే పరుగు అందుకున్నాడు. వెనక్కి కూడా తిరిగి చూడలేదు.
undefined
ఢిల్లీ మెట్రోలో దారుణంగా కొట్టుకున్న వ్యక్తులు.. వీడియో వైరల్..
షాక్ అయిన ఆ అమ్మాయి.. తన దగ్గర ఉన్న బ్యాగును వారికి ఇచ్చేసింది.. చాలా బేలగా..ప్రియుడు పారిపోయిన వైపుకే చూస్తూ నిలుచుండి పోయింది. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే తన శక్తికి మించి కాపాడాల్సిన వ్యక్తి కనీసం తన దిక్కు కూడా చూడకుండా పారిపోవడంతో ఆమె ఒకసారిగా షాక్ అయింది.
ఆమె పరిస్థితి చూసిన దొంగకి మనసు కరిగిపోయింది. ఆ అమ్మాయిని అతను వదిలేసి వెళ్లడం బాధ కలిగించింది. వెంటనే.. ఆమె దగ్గర కొట్టేసిన బ్యాగును.. ఆమెకే ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా..దీనిమీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దొంగ బ్యాగును కొట్టేయడం కంటే పారిపోవడమే ఆమెను ఎక్కువగా బాధించిందని ఒకరు కామెంట్ చేశారు.
మరొకరు కామెంట్ చేస్తూ.. వారి ప్రేమకు ఎదురైనా పరీక్షలో ఆ ప్రియుడు విఫలమయ్యాడని అన్నారు. చాలామంది లవర్ ను తిడుతూ.. దొంగను మెచ్చుకున్నారు. లవర్ కంటే దొంగ హృదయం మంచిదని కామెంట్ చేశారు.
Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE
— The Best (@Figensport)