మూగజీవులపై ఎందుకింత కక్ష? కుక్క పిల్లలను లిఫ్టులోకి తీసుకెళ్లి.. 

By Rajesh KarampooriFirst Published Apr 14, 2023, 8:08 PM IST
Highlights

viral Video: హర్యానాలోని గురుగ్రామ్‌లో అమానుష జరిగింది. ఇటీవల ఓ ఇంటి పనిమనిషిగా చేసే మహిళ లిఫ్ట్‌లో పెంపుడు కుక్కలను దారుణంగా కొట్టించింది. నేలకు విసిరికొట్టి, చిత్రహింసలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. జంతు సంరక్షణ కార్యకర్తల ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Viral Video: హర్యానాలోని గుర్గావ్‌ (Gurgaon) నుంచి వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మూగజీవాలపై ఓ పనిమనిషి ప్రతాపం చూపించింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. మూగజీవులనే జాలి, దయ లేదంటూ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియో పోలీసుల ద్రుష్టికి వెళ్లడంతో.. వీడియో ఆధారంగాకేసు నమోదు చేశారు. 

అసలేం జరిగింది? 

గుర్గావ్ లోని సెక్టార్-109 సొసైటీలో పనిచేసే ఓ మహిళ.. మూగజీవులపై దారుణంగా వ్యవహరించింది. కుక్క పిల్లలను వాకింగ్ తీసుకెళ్లేందుకు బయటకు వచ్చింది. ఈ క్రమంలో  రెండు కుక్క పిల్లలతో పనిమనిషి లిప్టు ఎక్కింది. ఆ తర్వాత లిఫ్టు డోర్లు మూసుకోగానే ఆమె తన ప్రతాపం ఆ మూగజీవాలపై చూపించింది. ఎక్కడి కోపమో తెలియదు కాదనీ, చిన్న కుక్క పిల్లలపై విరుచుకుపడింది. ఎంతలా అంటే.. ఓ కుక్కపిల్లను దాని మెడలో ఉన్న తాడును పట్టుకుని.. తిప్పితిప్పి నేల కేసి బాదింది. నిజంగా ఆ వీడియో చూసిన ఏ మనిషికైనా .. ఆ పనిమనిషి మీద కోపం రాక మానదు.  ఆ పని మనిషి చేసిన దాష్టికం లిఫ్టులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో వైరల్‌గా మారింది. 

దీంతో వెంటనే పీపుల్ ఫర్ ఎనిమల్స్ (PFA) వాలంటీర్లు యాక్టివ్ అయ్యారు. మొత్తం ఘటనపై బజ్‌ఘెడా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ పెంపుడు జంతువు..  సెక్టార్ 109లో సొసైటీలో నివసించే తండ్రి, కొడుకులకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఆ పెంపుడు జంతువును పెంచుకోవడానికే ఆ  పనిమనిషిని పెట్టుకున్నారట. గత బుధవారం కుక్కపిల్లలను వాకింగ్ తీసుకెళ్లే సమయంలో జరిగిందని,  అక్కడే ఓ కుక్కపిల్లపై విచక్షణరహితంగా దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ వాదన మరోలా ఉంది. తనను కుక్క కరవాలనుకుందని, దీంతో కోపంలో కొట్టానని ఆమె అంటుంది.

Shocking video came from Gurgaon, Haryana. Woman slaps dog in lift, FIR registered. pic.twitter.com/G6GbwkCXkI

— Jacob Mathew (@Jacobmathewlive)
click me!