ఆ పెంపుడు జంతువులను తమ పిల్లల కంటే.. ఎక్కువ ప్రేమతో పెంచేవారు కూడా ఉన్నారు. అయితే.. ఓ మహిళ ఏకంగా.. తన పెంపుడు పిల్లికి.. తన రొమ్ము పాలు తాగించింది. అది కూడా విమానంలో కావడం గమనార్హం.
ఈ ప్రపంచంలో చాలా మంది పిల్లులు, కుక్కలను పెంచుకుంటారనే విషయం మనకు తెలిసిందే. ఆ పెంపుడు జంతువులను తమ పిల్లల కంటే.. ఎక్కువ ప్రేమతో పెంచేవారు కూడా ఉన్నారు. అయితే.. ఓ మహిళ ఏకంగా.. తన పెంపుడు పిల్లికి.. తన రొమ్ము పాలు తాగించింది. అది కూడా విమానంలో కావడం గమనార్హం.
అమెరికాలోని డెల్టా ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన పాలను పిల్లికి పట్టించింది. దీంతో విమానంలోని మిగతా ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది కూడా అలా చేయొద్దని ఆమెకు చేసినప్పటికీ ఆమె పాలు పట్టడాన్ని ఆపలేదు. దీంతో విమానం అట్లాంటా లో దిగిన వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు. అమెరికా రూల్స్ ప్రకారం ప్రయాణికులు తమ పెంపుడు జంతువుల్ని తమతో విమానాల్లో తీసుకెళ్ళొచ్చు కానీ వాటిని పంజరాల్లోనే ఉంచాలి. అయితే ఈ మహిళ ఆ రూల్‌ను బ్రేక్ చేయడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు
I saw this on Reddit today. It’s an a ACARS in-flight message from the cockpit to the ground.
Also, civilization had a good run. pic.twitter.com/AjQhIaE80H
undefined
గుర్తుతెలియని ఓ మహిళ న్యూయార్క్‌లోని సిరక్యూస్ విమానాశ్రయం నుంచి జార్జియాలోని అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలోని 13 ఏ సీటులో కూర్చొని తన పెంపుడు పిల్లికి పాలిచ్చింది. పిల్లికి పాలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని చూసిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంట్రుకలు లేని పెంపుడు పిల్లిని దుప్పటిలో కప్పిన మహిళ విమానం ఎక్కడంతో అది శిశువులా కనిపించిందని ఫ్లైట్ అటెండెంట్ ఐన్ల్సీ ఎలిజబెత్ చెప్పింది. విమానంలో పిల్లికి పాలివ్వడం ఆపాలని విమాన సిబ్బంది మహిళను కోరినా ఆమె నిరాకరించింది.
ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రయాణికుడు ట్విట్టరులో పోస్టు చేశారు. విమానం ల్యాండింగ్ అయ్యాక ఎయిర్ లైన్ రెడ్ కోట్ బృందం రంగంలోకి దిగి పిల్లికి పాలిచ్చిన మహిళను ఆరా తీస్తుంది.విమానంలో పెంపుడు పిల్లికి పాలు ఇచ్చిన మహిళ టిక్ టాక్ వీడియోను ఫ్లైట్ అటెండెంట్ ఐన్స్లీ ఎలిజబెత్ కూడా షేర్ చేసింది. కాగా ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించ లేదు.