ఏకే-47 నుంచి కాల్చిన బుల్లెట్‌ను నోటితో పట్టుకుంటున్న ఆఫ్రికన్ సైనికుడు?.. వైరల్ వీడియో..

By Sumanth KanukulaFirst Published Apr 4, 2023, 3:33 PM IST
Highlights

సోషల్ మీడియాలో అనేక రకాలు వీడియోలు పోస్టు అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తాయి.

సోషల్ మీడియాలో అనేక రకాలు వీడియోలు పోస్టు అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే తాజాగా ఓ ఆఫ్రికన్ సైనికుడు తన నోటితో ఏకే-47 నుండి కాల్చిన బుల్లెట్లను పట్టుకోవడానికి ధైర్యం చేసినట్టుగా చూపెడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో కొంత భయాన్ని  కలిగించేలా ఉంది. అయితే ఈ వీడియోను చూసిన కొందరు అది ప్రాప్ గన్ లాగా ఉందని, మరికొందరు వీడియోలో ఉన్నట్లుగా తుపాకీల ముందు భాగంలో షెల్ కాస్టింగ్ బయటకు రానందున ఇది నకిలీదని అంటున్నారు. 

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోలో.. సైకిక దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి రైఫిల్‌తో తన నోటికి దగ్గరగా లేదా నోటిలోకి కాల్పులు జరుపుతున్నట్లు చూపిస్తుంది. కొన్ని సెకన్ల తరువాత ఆ వ్యక్తి బుల్లెట్ల తన నోటిలో నుంచి గుండ్లను ఉమ్మివేస్తాడు. నో కాన్‌టెక్స్ట్ హ్యుమన్స్‌ అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో షేర్ చేయబడింది. ఈ ఏప్రిల్ 2వ తేదీన పోస్టు చేసిన ఈ వీడియోకు మిలియన్‌ల కొద్ది నెటిజన్స్‌ వీక్షించారు. 

 

pic.twitter.com/rQ8hjHg3ZN

— NO CONTEXT HUMANS 👤 (@HumansNoContext)


ఇదిలా ఉంటే.. ‘‘లుహ్ ట్విజ్జీ’’ అని పిలుచుకునే వేలాది మంది యువకులు శనివారం మాల్ ఆఫ్ ఆఫ్రికాలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారు. గందరగోళానికి సంబంధించిన వీడియోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడ్డాయి. టీనేజర్లు 'లుహ్ ట్విజ్జీ' ఛాలెంజ్ అనే టిక్ టాక్ ఛాలెంజ్‌లో పాల్గొంటారని సమాచారం. ఒక మాల్‌పై దాడి చేసి గందరగోళం సృష్టించడం, ఆపై వదిలివేయడం అనేది చాలెంజ్. కొన్నిసార్లు మాల్‌లో గొడవలు కూడా చేస్తుంటారు. నివేదికల ప్రకారం.. యువకులు గ్యాంగ్ అప్ చేయడానికి అస్థిపంజర ప్రింట్‌అవుట్‌లతో కూడిన నల్లని దుస్తులను ధరిస్తారు. అయితే శనివారం జరిగిన గొడవలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గాయపడిన యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది.
 

click me!