ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. లక్షలాది వ్యూస్, వేలాది షేర్లతో వైరల్ గా మారింది. దీనికి కారణం ఆ చిన్నారి అడిగిన ఒకే ప్రశ్న.. అదేంటంటే....
జమ్మూకశ్మీర్ : ఓ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాశ్మీర్‌లో తన పర్యటనలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ముద్దుముద్దుగా సమాధానం చెప్పుకొచ్చిందీ గడసరి.. అంతేకాదు కశ్మీర్ లో తాను మంచు చూడడానికి వచ్చానని.. మంచుతో ఆడుకోవాలని ఎంతో ఆశపడ్డానని.. కానీ మంచు కనిపించకపోవడం నిరుత్సాహపరిచిందని చెప్పింది.
మీరెప్పుడైనా కశ్మీర్ లో మంచు చూశారా? అంటూ ఎదురు ప్రశ్నించింది. తాము కశ్మీర్ కు రావడం ఇదే మొదటిసారి అని ఇక్కడి వాతావరణం తనకు బాగా నచ్చిందని.. తులీప్ గార్డెన్ చూడడానికి వెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో జమ్మూ కాశ్మీర్‌లోని పోలీసు అధికారి ఇంతియాజ్ హుస్సేన్ దృష్టిని ఆకర్షించింది, హుస్సేన్ ట్విట్టర్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. శీతాకాలంలో తిరిగి రావాలని అప్పుడు ఆ చిన్నారి కోరిక తీరుతుందని కోరారు.
undefined
"నేను ఇక్కడికి వచ్చింది కేవలం మంచును తాకడానికే.. కానీ, మేం వచ్చేసరికి మంచు కురవడం లేదు’’ అని ఆ అమ్మాయి చెబుతోంది. దీనికి సమాధానంగా "హే క్యూటీ. చలికాలంలో మళ్లీ రండి. నీకు వాగ్దానం చేస్తున్నాను, అప్పుడు మంచు కురుస్తుంది” అని హుస్సేన్ ట్వీట్ చేశారు.
ఈ వీడియో వైరల్‌గా మారింది, సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ వచ్చాయి. ఇందులో ఆ చిన్నారి మాట్లాడుతూ.. “నా పేరు పౌషిక, నేను పువ్వులను చూడడానికి ఇక్కడకు వచ్చాను. ఇక్కడిని నిన్న విమానంలో వచ్చాం. ఇక్కడికి రావడం చాలా సరదాగా అనిపిస్తుంది. హోటల్ లో ఉన్నాం. తులిప్ గార్డెన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే బోట్ హోటల్‌కి వెళ్లాలని కూడా అనుకుంటున్నాం”అని అమ్మాయి మీడియా ప్రతినిధితో చెప్పింది. అంతేకాదు "కాశ్మీర్‌లో మంచు ఎప్పుడైనా చూసారా?" అని రిపోర్టర్ ని ఆమె అడుగుతుంది. “నేనైతే చూడలేదు. కానీ కశ్మీర్ లో ఉన్న పర్వతాలు చాలా చలిగా ఉన్నాయి. వాటిని చూశాను ... "అంటూ చెప్పుకొచ్చింది.
కాశ్మీర్ గురించి అడిగినప్పుడు, అమ్మాయి బదులిస్తూ, “కాశ్మీర్ చాలా అందమైన ప్రదేశం, భాష కూడా చాలా బాగుంది. నిజానికి నాకు హోటళ్లు, పడవలు, పర్వతాలు అంటే చాలా ఇష్టం.” ఆ అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తీరు నెటిజన్లకు నచ్చింది. “ఆమె పూర్తిగా ఏకాగ్రతతో ఉంది, ఇతరుల నుండి ఎటువంటి పరధ్యానం లేదు, చక్కగా మాట్లాడింది. అద్భుతమైన అభిప్రాయాల వ్యక్తీకరణలు. చాలా బాగుంది,” అని ఒకరు వ్యాఖ్యానించారు.
Hey,Cutie😍
Come again in winter. Promise, it will snow then😊 pic.twitter.com/2eG7RIccPc