Viral Video: ఏంటి ఇది కేక్ ఆ.., మటన్ లా ఉందేంటి..?

Published : Dec 03, 2021, 09:58 AM ISTUpdated : Dec 03, 2021, 10:48 AM IST
Viral Video: ఏంటి ఇది కేక్ ఆ.., మటన్ లా ఉందేంటి..?

సారాంశం

అంత డిఫరెంట్ గా.. కేక్ లను డిజైన్ చేస్తున్నారు. ఈ డిఫరెంట్ కేక్స్.. గత కొంతకాలంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ డిఫరెంట్ కేక్ ను కట్ చేస్తే గానీ.. అది కేక్ అనే విషయం తెలియడం లేదు. తాజాగా.. నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.

పుట్టిన రోజు, పెళ్లి రోజు, వార్షికోత్సవాలు, ఫంక్షన్... ఇలా శుభకార్యం ఏదైనా.. అక్కడ కచ్చితంగా ఉండేది కేక్.  ప్రతి ఫంక్షన్ లో.. కేక్ కట్ చేయడం.. ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనందాన్ని.. కేక్ కట్ చేయడంతో.. ఇతరులకు పంచుకుంటున్నారు. అయితే.. ఒకప్పుడు కేక్ అంటే.. కేవలం గుండ్రని ఆకారంలో మాత్రమే ఉండేది. తర్వాత ర్వాత.. విభిన్న  ఆకారాల్లో కేకుల తయారీ మొదలుపెట్టారు.

 

ఇప్పుడు.. ఆ కేకులతో విభిన్న ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా.. వాటిని ఫస్ట్ చూడగానే.. అది కేక్ అనే ఫీలింగ్ ఎవరికీ కలగదు. అంత డిఫరెంట్ గా.. కేక్ లను డిజైన్ చేస్తున్నారు. ఈ డిఫరెంట్ కేక్స్.. గత కొంతకాలంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ డిఫరెంట్ కేక్ ను కట్ చేస్తే గానీ.. అది కేక్ అనే విషయం తెలియడం లేదు. తాజాగా.. నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.

అందులో.. ఓ వ్యక్తి కత్తితో మటన్ కట్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే.. తీరా కట్ చేశాక తెలిసిన విషయం ఏమిటంటే.. అది కేక్ అని. అసలు.. దానిని ఎవరూ కేక్ అనుకోరు. ఏదో.. డిఫరెంట్ మటన్ ఐటెమ్ అని అనుకుంటారు. మటన్ ముక్క ఎముకలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కట్ చేశాక.. కేక్ అని తెలియడంతో.. అందరూ విస్మయానికి గురయ్యారు. దీంతో.. ఈ వీడియో ఇప్పుడు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

ఈ వీడియోను @Karnythia అనే వ్యక్తి  ట్విట్టర్‌లో  షేర్  చేసారు,  వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే  5.6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.  దీనికి 16.7k పైగా లైక్‌లు ,వేలాది రీట్వీట్లు ,  కామెంట్ల వర్షం కురవడం గమనార్హం.

ఇన్‌స్టాగ్రామ్‌లో @inaecakes అనే పేజీలో ముందుగా.. ఈ మటన్ కేక్  ఫోటోని షేర్ చేశారు. మీకు కూడా.. ఈ డిఫరెంట్ కేక్ చూడాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో  చూసేయండి. 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్