ఆ మూడు తాచు పాముల్లా కనపడుతున్నాయి. మూడింటి ముందు కూర్చొని.. వాటిని చేత్తో ఆడిస్తున్నాడు. అయితే.. అనుకోకుండా.. అతనికి ఆ సమయంలో చేదు అనుభవం ఎదురైంది.
పాము అంత దూరంలో కనిపడితేనే.. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీస్తాం. అలాంటిది ఓ యువకుడు ఏకంగా మూడు పాముల ముందు కూర్చొని.. వాటితో ఆడుకోవాలని అనుకున్నాడు. కానీ.. చివరకు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకు చెందిన మాజ్ సయ్యద్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్. అతని యూట్యూబ్ ఛానల్‌లో పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. కాగా.. ఇటీవల అతను ఒకేసారి మూడు పాములను ఆడించాలని అనుకున్నాడు. ఆ మూడు తాచు పాముల్లా కనపడుతున్నాయి. మూడింటి ముందు కూర్చొని.. వాటిని చేత్తో ఆడిస్తున్నాడు. అయితే.. అనుకోకుండా.. అతనికి ఆ సమయంలో చేదు అనుభవం ఎదురైంది.
This is just horrific way of handling cobras…
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc
పాములను భయపెడుతుండగా ఊహించని విధంగా అందులోని ఓ పాము అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి చేసింది. వ్యక్తి మీదకు జంప్ చేసి అతని మోకాలిని కొరికి పట్టుకుంది. దీంతో షాక్‌కు గురైన వ్యక్తి పామును లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎంతకీ విడిచి పెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్‌లో పోస్టు చేశారు. కాగా.. వీడియో వైరల్ అవుతుండగా... నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా భయమేసిందని చాలా మంది కామెంట్స్ చేయడం గమనార్హం. కొందరు.. అందుకే ప్రాణాలతో చెలగాటమాడకూడదంటూ సలహాలు ఇస్తున్నారు.