ఇంటి అద్దె కట్టలేక.. ఆఫీసుకే మకాం మార్చిన ఉద్యోగి.. చివరికి ఏమైందంటే..

By SumaBala Bukka  |  First Published Mar 17, 2022, 10:22 AM IST

ఇంటి అద్దె కట్టలేక ఓ ఉద్యోగి తన మకాం ఆఫీనుకే మార్చాడు. అక్కడే ఉంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ గా మారాడు. అయితే నాలుగు రోజుల తరువాతే అసలు విషయం బయటపడింది. 


కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్ని అతలాకుతలం చేసింది. ఎంతో మందిని నిరాశ్రయులుగా, నిరుపేదలుగా, ఆనాధలుగా మార్చింది. కష్టాల కడలిలోకి నెట్టేసింది. కరోనా కారణంగా జీతాల్లో కోతలు, తగ్గింపులు అప్పటివరకు ఓ మోస్తారుగా నడుస్తున్న జీవితాల్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటి కిరాయిలు కట్టలేక.. ఉద్యోగాలు వదులుకోలేక.. ఆ తక్కువ మొత్తాలను బైటికి చెప్పలేక మానసిక వేదనతో బలైపోతున్న వాళ్లూ ఉన్నారు. 

అయితే ఇలాంటి పరిస్తితే ఓ టిక్ టాక్ యూజర్ కూ వచ్చింది. దీనికోసం అతనో సాహసనిర్ణయం తీసుకున్నాడు. అపార్ట్ మెంట్ రెంట్ కట్టలేక తన నివాసాన్ని తాను పనిచేసే ఆఫీసుకే మార్చాడు. ఆఫీసులో తన సీటున్న క్యుబిక్ లోనే కాపురం పెట్టాడు. ఇదంతా టిక్ టాక్ లో వీడియోలు తీసి షేర్ చేశాడు.

Latest Videos

undefined

వీళ్లు ఇచ్చే జీతం అద్దె కడుతూ జీవించే స్తాయిలో లేదు కాబట్టి తప్పనిపరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయానికి రావాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకాదు క్యుబిక్ టూర్ కూడా వీడియో చేశాడు. తాను ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు.. ఎలా పనిచేస్తున్నాడో అందులో చూపించాడు.

కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్న కారణంగా తనకు క్యుబిక్ లో ఉండడం సులభమయిందని కూడా చెప్పాడు. తన వస్తువులు అన్ ప్యాకింగ్ గానే ఉంచానని అన్నాడు. నాలుగు రోజుల తరువాత అతడిని గమనించిన ఆఫీస్ సెక్యురిటీ అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు కూడా తీసేయాలని కోరారు. 

‘ఏం చేయను.. వీళ్లిచ్చే జీతంతో ఇల్లు మెయింటేన్ చేస్తూ.. పని చేయడం సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసకున్నా. దీనివల్ల నా ఉద్యోగానికి ప్రమాదం వచ్చినా చెప్పలేను’ అంటూ ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే ఓ యూజర్ ‘సీసీ కెమెరాల్లో దొరికిపోవా..’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘చాలా కార్పొరేట్ కంపెనీల్లో సీసీ టీవీ కెమెరాలు ఉండవు’ అంటూ చెప్పుకొచ్చాడు.  

నాలుగు రోజులు తరువాత అతడిని గమనించిన హెచ్ ఆర్ సిబ్బంది ఖాళీ చేయాల్సిందిగా కోరారని, వీడియోలు కూడా డిలిట్ చేయమని చెప్పారని.. సో కంపెనీతో నా అనుబంధం ముగింపుకు వచ్చిందంటూ మరో వీడియో షేర్ చేశాడు. ఇప్పుడు సిమన్ అనే అతను ఉద్యోగంలో ఉన్నాడా? లేక ఊస్టింగ్ అయ్యిందా? అనేది తెలీదు కానీ అతని వీడియోలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

click me!