మెట్రో స్టేషన్ లో ట్రైనర్ తో కలిసి యోగా చేసిన కుక్క.. వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

By SumaBala BukkaFirst Published Nov 11, 2022, 1:03 PM IST
Highlights

పెంపుడు కుక్కలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. ఇక అది మనం చేసినట్టుగా యోగా చేస్తే.. అబ్బురపడుతున్నారా? అలాగే జరిగింది ఢిల్లీ మెట్రో స్టేషన్ లో...

పెంపుడు జంతువులు యజమాని నేర్పించే పనులు ఈజీగా నేర్చుకుని చేసేస్తుంటాయి. ఇక అందులోనూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కుక్కలు ఇంకా ఎలా ఉంటాయో ఆలోచించండి. అని ప్రత్యేకంగా శిక్షణ పొందుతాయి. అయితే అలాంటి సీఐఎస్ఎఫ్ డాగ్స్ యోగా కూడా చేస్తాయని మీకు తెలుసా? ఢిల్లీ మెట్రో స్టేషన్ లో బ్లాక్ లాబ్రడార్ కుక్క ట్రైనర్ తో కలిసి యోగా చేసింది. యోగా దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులు తమ పెంపుడు  జంతువులను విభిన్న రీతుల్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ రోజులు జరుపుకుంటారు.

అయితే ఈ కుక్క అలా కాదు. ఇది తన శిక్షకుడితో పాటు యోగాను కూడా అభ్యసిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు. ఈ కుక్క సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మెట్రో స్టేషన్ లో యోగా చేస్తుండగా స్థానికులు, సిబ్బంది దాన్ని వీడియో తీస్తూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూడా కుక్క ట్రైనింగ్ చూసి ఫిదా అవుతున్నారు. 
 

click me!