బిడ్డను భూమిలో పాతిపెట్టేందుకు తవ్వుతుండగా... అక్కడ ఓ బ్యాగ్ కనపడింది. దానిని ఓపెన్ చేయగా... అందులో నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. బ్యాగ్ తెరచి చూడగా.... ఓ క్లాత్ లో అప్పుడే పుట్టిన బిడ్డను చుట్టి ఉంచారు. ఆ బిడ్డ ఇంకా బతికే ఉండటంతో వెంటనే హితేష్ అంబులెన్స్ కి ఫోన్ చేసి దగ్గరలోని చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
బిడ్డ కోసం ఆ దంపతులు ఎన్నోకలలు కన్నారు. కానీ వారి కలలు అన్నీ కలలుగానే మిగిలిపోయాయి. పుట్టిన బిడ్డ.... పురిట్లోనే చనిపోయింది. దీంతో... గుండె నిండా బాధతో ఆ బిడ్డను పూడ్చి పెట్టడానికి దంపతులు స్మశానానికి వెళ్లారు. అక్కడ బిడ్డను భూమిలో పాతిపెట్టేందుకు తవ్వగా... మరో బిడ్డ దొరికింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ ప్రాంతానికి చెందిన హితేశ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య వైశాలి ను డెలివరీ కోసం రామ్ పూర్ గార్డెన్ హాస్పిటల్ కి తీసుకువచ్చారు. అయితే వైశాలి బిడ్డ పురిట్లోనే చనిపోయింది. దీంతో... ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దగ్గరలోని స్మశాన వాటికకు వెళ్లారు.
undefined
బిడ్డను భూమిలో పాతిపెట్టేందుకు తవ్వుతుండగా... అక్కడ ఓ బ్యాగ్ కనపడింది. దానిని ఓపెన్ చేయగా... అందులో నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. బ్యాగ్ తెరచి చూడగా.... ఓ క్లాత్ లో అప్పుడే పుట్టిన బిడ్డను చుట్టి ఉంచారు. ఆ బిడ్డ ఇంకా బతికే ఉండటంతో వెంటనే హితేష్ అంబులెన్స్ కి ఫోన్ చేసి దగ్గరలోని చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
కాగా..ఆ బిడ్డ కేవలం 1.1కేజీ బరువుతో పుట్టిందని... ప్రీమెచ్యూర్డ్ బేబీ కావచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. పెళ్లికాకముందే పుట్టిన బిడ్డనో, తక్కువ బరువుతో పుట్టిందనో లేక... ఆడపిల్ల అనే కారణంతో ఇలా చంపేయాలని భావించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఇలా బరువు తక్కువగా పుట్టిన బిడ్డలకు ఆక్సీజన్ తక్కువగా ఉండటం అవసరమని... అందుకే ఆ బిడ్డ బతికిందని వైద్యులు చెప్పారు.
అది కూడా.. బిడ్డను భూమిలో పూడ్చి కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే అవుతోందని...అందుకే బతికే ఉందని తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆ బిడ్డను అక్కడ ఎవరు వదిలి వెళ్లారో సీసీ కెమేరాల ఆధారంగా తెలుసుకుంటున్నామని వారు తెలిపారు. డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై హితేష్ మాట్లాడుతూ... బిడ్డ ఏడుపు వినపడగానే... మా బిడ్డే బతికిందని అనుకున్నానని... కానీ ఏడుపు గుంతలోని బ్యాగులో నుంచి వచ్చిందని చెప్పాడు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.