బెంగళూరులో ఉంటున్న ఒక మహిళకు కేవలం రూ. 6కి ఉబెర్ రైడ్‌ను దొరికింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది.
బెంగళూరు : బెంగళూరు పేరు వినగానే ట్రాఫిక్ రద్దీ గుర్తుకువస్తుంది. మామూలు రోజుల్లో భయంకరమైన ట్రాఫిక్ రద్దీకి బెంగళూరు ప్రసిద్ధి చెందింది. రద్దీ సమయాల్లో ఉదయం ప్రయాణమైనా లేదా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయమైనా, రోజువారీ ప్రయాణం బెంగళూరులో సవాల్ గా ఉంటుంది.
ఈ భయంకరమైన ట్రాఫిక్ కు తోడు నగరంలో క్యాబ్ సర్వీస్‌లు కూడా అధిక రేట్లు బాదుతుంటాయి. అయితే, ఒక మహిళకు మాత్రం ఓ ఆశ్యర్యకరమైన అనుభవం ఎదురయ్యింది. కేవలం రూ. 6కి ఉబెర్ రైడ్‌ను దొరికిందని తన సంతోషాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియా వినియోగదారులను, ముఖ్యంగా బెంగళూరులో వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
తను క్యాబ్ కు చార్జ్ చేసిన రూ. 6 చూపే స్క్రీన్‌షాట్‌ను కూడా ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసారు. అసలు మొత్తం రూ. 46.24. కాగా, ప్రమోషనల్ కోడ్ వాడడంతో ఈ ఛార్జీ రూ.6కి తగ్గింది. అయినప్పటికీ, ఇంత తక్కువ ధర బెంగళూరు వాసులకు అరుదైన సంఘటన.
ఊహించినట్లుగానే, ఈ క్యాబ్ రైడ్ ఛార్జీలతో సోషల్ మీడియా ఆశ్చర్యపోయింది. ఈ ఛార్జీలు, ముఖ్యంగా నగరంలో రద్దీ సమయాల్లో విపరీతమైన ధరల పెరుగుదలను అనుభవించిన బెంగళూరు వాసులు నమ్మలేకపోతున్నారు.
దీంతో ఈ పోస్ట్ కు అపారమైన జనాదరణ వచ్చింది. ఈ పోస్ట్ కు వెంటనే 50,000 వ్యూస్ వచ్చాయి. చాలామంది దీనిమీద కామెంట్స్ కూడా పెట్టారు. ఒకరు కామెంట్ చేస్తూ... "తమాషా విషయం ఏంటంటే.. నాకూ నిన్న ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. నా రైడ్ మీద 35% తగ్గింపు లభించింది. దీంతో ధర సున్నాకు చేరుకుంది. నా రైడ్‌ను ఏ డ్రైవర్ అంగీకరించలేదని చెప్పనవసరం లేదనుకుంటా" అని ఒకరు వ్యాఖ్యానించారు.