తాజ్ మహల్ చూడడానికి వెళ్లిన ఓ టూరిస్ట్ ను కొందరు చావచితకబాదారు. కర్రలు, రాడ్లతో వెంబడించి మరీ దారుణంగా కొట్టారు.
ఆగ్రా : ఢిల్లీలోని ఆగ్రాలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఓ పర్యాటకుడు తాజ్ మహల్ చూడడానికి వెళ్ళగా అతని మీద కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని ఆ పర్యాటకుడు స్వీట్ షాప్ లోకి వెళ్ళగా కర్రలు, ఇనుప రాడ్లతో వెంబడించి మరీ చితకొట్టారు.
దాడికి కారణంగా తమలో ఒకరిని అతని కారుతో ఢీకొట్టాడని చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలు లో రికార్డు అయ్యాయి. దాడికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. దీనికి సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
undefined
స్పీడ్ బైక్‌పై జంట రొమాన్స్ వైరల్.. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారంటే...
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ టూరిస్టు తాజమహల్ ని చూడడం కోసం ఆదివారం నాడు ఆగ్రాకు వచ్చాడు. ఆగ్రాలోని బసాయ్ చౌకి- తాజ్గంజ్ మార్గంలో కారులో వెళుతున్నాడు. ఆ సమయంలో పక్కనే కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు.
వారు కూడా తాజమహల్ సందర్శించడానికి వచ్చిన వారిలాగే ఉన్నారు. కారు వెడుతున్న క్రమంలో వారిలో ఒకరికి కారు తాకింది. వెంటనే ఆ టూరిస్ట్ తన కారు ఆపి వారికి క్షమాపణలు చెప్పాడు. అయితే, కారు తాకడంతో తీవ్ర అగ్రహావేషాలకు లోనైనా వారు అతని క్షమాపణలను పట్టించుకోలేదు. తీవ్రంగా తిడుతూ.. అతని మీద దాడికి దిగారు.
భయాందోళనలకు గురైన ఆ టూరిస్టు వారి నుంచి తప్పించుకోవడానికి కారును వదిలేసి పక్కనే ఉన్న స్వీట్ షాప్ లోకి పరిగెత్తాడు. ఐదుగురు యువకులు అతనిని వదలకుండా ఇనుప రాడ్లు, కర్రలతో అతని వెంబడించి స్వీట్ షాప్ లోకి దూరారు. అతనుఎంత వద్దని వారిస్తున్నా, బతిమాలుతున్నా వినిపించుకోలేదు. కొద్ది నిమిషాల పాటు వీరంగం సృష్టించారు.
ఆ టూరిస్ట్ ను చావచితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీలో నమోదైన ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిమీద నెటిజన్లు కామెంట్ల వరద కురిపిస్తున్నారు. తాజమహల్ ను చూడడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారని.. ఈ ఘటనతో వారు భయాందోళనలకు గురవుతారని.. దేశం పరువు పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ఆగ్రా పోలీసులు స్పందించారు. తాము చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేసినట్లుగా ట్విట్టర్లో తెలిపారు. నిందితులను కోర్టుకు తీసుకెళ్తామని... చట్ట ప్రకారం వారికి శిక్షలు పడేలాగా, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Video from Agra . Tourist Beaten by Locals. pic.twitter.com/zuXq7qdwLN
— देश सर्वप्रथम (@deshsarvpratham)